• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కాకినాడ పోర్టులో పోటెత్తిన పవన్..వారికి వార్నింగ్

admin by admin
November 29, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
97
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కాకినాడ పోర్టు నుంచి దక్షిణాఫ్రికాకు 640 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ ను కాకినాడ కలెక్టర్ రెండు రోజుల క్రితం అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ షిప్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షిప్ లో ప్రయాణించి పరిశీలించారు. ఈ క్రమంలోనే కాకినాడ పోర్టు అథారిటీపై పవన్ ఫైర్ అయ్యారు. ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక పెద్ద పెద్ద వ్యక్తులున్నారని, ఇంటర్నేషనల్ గా ఈ స్మగ్లింగ్ జరుగుతోందని, అయినా సరే ఎవ్వరినీ వదిలిపెట్టనని పవన్ హెచ్చరించారు.

కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో పాటు పోర్టు అధికారులపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే కష్టమని, ఈ రోజు బియ్యం అక్రమ రవాణా జరిగిందని, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు రావని గ్యారెంటీ ఏంటని పవన్ నిలదీశారు. కసబ్ వంటి టెర్రరిస్టులు కాకినాడ తీర ప్రాంతానికి వచ్చే అవకాశముందని, 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడా కాల్చేసినా దిక్కు లేదని, ఇక్కడ భద్రతా లోపాలు చాలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. 2 నెలల నుంచి ఇక్కడ పర్యటించాలని అనుకుంటున్నానని, కానీ, తననే అడ్డుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని చెప్పారు.

ఈ పోర్టు నుంచి డ్రగ్స్, ఆయుధాలు ఇతర దేశాలుకు వెళ్లే అవకాశం, అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మినిస్టర్ వంగలపూడి అనిత, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ వ్యవహారంపై లేఖ రాస్తామని అన్నారు. కాకినాడ పోర్టు అధికార యంత్రాంగంలో కూడా ప్రక్షాళన జరగాలని, సీఎం చంద్రబాబుకు ఈ విషయం గురించి చెప్పానని, మరోసారి కలిసి సీబీఐ, సీఐడీ దర్యాప్తు పై చర్చిస్తామని అన్నారు. ఇంటర్నేషనల్ స్మగ్లర్లయినా తాను లెక్కచేయనని, ఆ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయాలని పవన్ అన్నారు.

Tags: ap deputy cm pawan kalyankakinada portration rice mafiawarning
Previous Post

అదానీ సేఫ్‌.. జ‌గ‌నే దొరికాడు .. !

Next Post

TANA -‘తానా’ ఫౌండేషన్ నిధుల సమాచారం!

Related Posts

Andhra

ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు

May 21, 2025
Andhra

ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Andhra

చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Load More
Next Post

TANA -'తానా' ఫౌండేషన్ నిధుల సమాచారం!

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra