రాష్ట్రమంతటా రాజధాని వైబ్రేషన్

అమరావతి... ఆంధ్రుల రాజధాని. జీవితాల్లో కొన్ని బంధాలు ఒకేసారి ఏర్పడతాయి. అవి శాశ్వతం. రాజధాని కూడా అలాంటి బంధమే. కానీ ఆ బంధాన్ని బలహీనం చేసి అవసరమైతే చిద్రం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఏపీలో కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ పార్టీ రాజధానిని మార్చాలని అనుకుంటోంది. ఇతర ప్రాంతాలు, ఇతర నగరాలు అభివృద్ధి చేయాలని అనుకోవడంలో ఏ తప్పులేదు. కానీ ఒక నగరాన్నిధ్వంసం చేయాలి అనుకోవడం తప్పు.
అమరావతిని రాజధానిగా ఉంచి వైజాగ్ ను వాణిజ్య, పర్యాటక రాజధానిగా చేయొచ్చు. నెల్లూరు గ్రేటర్ రాయలసీమ రీజియన్ రాజధానిగా చేయొచ్చు. ఎవరూ వద్దనలేదే.
కర్నూలును ఎయిర్ పోర్టు పెట్టి విద్య, ఐటీ రాజధానిగా చేయొచ్చు. ఎవరూ వద్దనరు కదా.
ఎందుకు అమరావతిని చంపి అక్కడివి ఇక్కడికి తేవాలి. ఇదేం వినాశకరమైన విధానం... ఇది శుద్ధతప్పు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం ఇదే. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే మూడు రాజధానులపై ఎవరూ ఆసక్తి చూపలేదు. జాతీయ స్థానిక పత్రికలు పెట్టిన అన్ని అభిప్రాయ సేకరణలో అమరావతికే మద్దతు దక్కింది. ప్రతిఒక్కరు మూడు రాజధానులు ఒక పిచ్చి చర్య అనే అన్నారు.
కుల ముద్ర వేసి, భయపెట్టి, పోలీసు కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి అమరావతిని నలిపేయాలని చేసిన ప్రయత్నాలన్నీ చిన్నాభిన్నం అయ్యాయి. చివరకు అమరావతి ఉద్యమం ఇంతింతై వటుడింతై... ప్రాణం పోయినా పర్లేదు అమరావతి సాధించుకోవాలని రైతులు, మహిళలు పట్టుదలగా ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నవారికి ఏడాది పాటు ఉద్యమం నడిపి చెంప చెళ్లుమనిపించారు. ఏడాదే కాదు, నాలుగేళ్లయినా ఉద్యమం ఆగదు. అమరావతి వచ్చేవరకు ఉద్యమం ఆగదు.
భౌతికంగా ఇతర ప్రాంతాలు పాత్రులు కాలేకపోవచ్చు గాని ప్రతి ఆంధ్రుడి మద్దతు అమరావతికే. ఇపుడు అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎమోషన్, ఒక వైబ్రేషన్. 29 వేల మంది రైతులు అంటే అది చిన్న ఉద్యమం కాదు, దేశం తప్పక పట్టించుకోకతప్పని ఉద్యమం.