బీజేపీలో విష్ణు స్థాన‌మేంటి... ఈ దూకుడేంటి? సీనియ‌ర్ల చ‌ర్చ

రాష్ట్ర బీజేపీలో ఇటీవ‌ల కాలంలో హాట్ కామెంట్ల‌తో మీడియాలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.. సీమ ప్రాంతా నికి చెందిన విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీ.. రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. అయితే.. ప్ర‌ధా న కార్య‌ద‌ర్శులు చాలా మందే ఉన్నా.. కేవ‌లం విష్ణుమాత్ర‌మే దూకుడుగా ఉన్నారు. చంద్ర‌బాబు స‌హా.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డుతున్నారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌పైనా, ఆయ‌న ప్ర‌భుత్వంపైనా మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఏదో చూచాయ‌గా.. అంటున్నా.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కు ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డం లేదు. ఇదిలావుంటే.. దిగువ‌స్థాయి నాయ‌కులు కూడా మీడియా ముందుకు రావ‌డ‌మో.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డమో చేయాల‌ని భావిస్తున్నారు.

కానీ, వారికి విష్ణు అడ్డు త‌గులుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. తాము ఏ స‌బ్జెక్టుపై మాట్లా డాలి.. ఏ ప్రాంతంలో ప‌ర్య‌టించాలి.. అనే విష‌యాల‌పై వారికి కార‌ణం లేక పోవ‌డం.. దీనిపై నేరుగా బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సోము వీర్రాజును క‌ల‌వాల‌ని డిసైడ్ చేసుకున్నారు. కానీ, ఎవ‌రు త‌న‌ను క‌ల‌వాల‌న్నా.. విష్ణుతో ముందు మాట్లాడిరావాల‌ని.. లేదా.. ఫోన్‌లో అయినా.. లైన్ తెలుసుకోవాల‌ని.. సోము సూచిస్తున్నారు. పోనీ.. ఈ సూచ‌న‌ల‌తో అయినా.. విష్ణు వ‌ద్ద‌కు వెళ్తామంటే.. ఆయ‌న ఎవ‌రికీ దొర‌క‌డం లేదు. త‌న‌ను తాను పెద్ద‌గా ఊహించుకుని.. పార్టీలో ఇత‌ర నేత‌లంతా త‌క్కువ‌.. నేనే ఎక్కువ అనే రేంజ్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారని బీజేపీలో గుస‌గుస వినిపిస్తోంది.

ఈ ప‌రిణామాల‌తో ఎక్క‌డి నాయ‌కులు అక్క‌డే ఉండిపోతున్నారు. ఫ‌లితంగా బీజేపీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్న వారు.. కేవ‌లం విష్ణు, సోములు మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. ఎవ‌రైనా ఏపీకి వ‌స్తే.. వారు మాత్ర‌మే మాట్లాడుతున్నారు. మ‌రి మాట్లాడే వారు లేరా..?  వారికి వాయిస్ లేదా? అంటే.. అన్నీ ఉన్నా.. విష్ణు కార‌ణంగా మౌనంగా ఉంటున్నార‌నేది ప్ర‌ధాన వాద‌న‌. ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే.. విష‌యం సోముకు తెలిసి కూడా.. ఏమీ చేయ‌లేక‌పోవ‌డం. ఎందుకంటే.. సోమును అంతో ఇంతో బ‌ల‌ప‌రుస్తోంది.. విష్ణు, జీవీఎల్ వంటివారే. విష్ణు.. జీవీఎల్ కూట‌మి స‌భ్యుడే కావ‌డంతో విష్ణు ఏం చెబితే.. అదే.. న‌డుస్తుంద‌నే ధోర‌ణిలో సోము ఉన్నార‌ని.. దీంతో త‌మ‌కు అవ‌కాశం చిక్క‌డం లేద‌ని అంటున్నారు బీజేపీ నేత‌లు. మ‌రి విష్ణు హ‌వా ప‌రోక్షంగా ఉన్న‌ప్ప‌టికీ.. అది పార్టీకి ఉపయోప‌డ‌న‌ప్పుడు ఎందుకు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.