అనుపమ పరమేశ్వరన్ ఆశిష్ రెడ్డి నటించిన రౌడీ బాయ్స్ సంక్రాంతికి పొగలు కక్కించింది.
ఇది థియేటర్లలో ప్రీమియర్ షో పడగానే ఆ డీప్ లిప్ లాక్ ప్రేక్షకులకు షాక్ ని ఇచ్చింది
సరైన హిట్ రాకపోవడంతో అనుపమ చివరకు పెదాలకు పనిచెప్పిందనుకోవాలి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ‘ప్రేమమ్’ ఫేమ్ కు ఇదే తొలి తెర ముద్దు.
స్క్రీన్‌పై ముద్దు సన్నివేశం చేయడానికి అనుపమ ఎలా అంగీకరించిందనేదే అందరిని సినిమా విడుదలైనపుడు వేధించిన ప్రశ్న.
అది కూడా తొలి పరిచయం అయిన హీరో ఆశిష్ రెడ్డికి లిప్ లాక్ ఇవ్వడం విస్మయమే.
ఈ సినిమాలో కథానాయికగా నటించేందుకు అనుపమకు రూ.50 లక్షలు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. డిజాస్టర్ హిస్టరీ ఉన్న హీరోయిన్ కు అంత రేటు పెట్టడానికి ఈ ముద్దులే కారణమా? అన్నది చర్చ.
అనుపమ మొదట్లో బోల్డ్ సన్నివేశాలకు నో చెప్పింది.
అసలే వరుస ఫ్లాపులు… తాజాగా భారీ రెమ్యునరేషన్ ఆమెను ఈ పనికి ఒప్పించింది.