టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంతల విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వీరు తమ విడాకుల గురించి ప్రకటన చేయకముందే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ వల్ల చై-సామ్ విడిపోయారంటూ ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో మూడు యూట్యూబ్ చానెళ్లపై సమంత కేసు కూడా పెట్టింది.
ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సమంతకు…విడాకుల గురించి నెటిజన్లు కొందరు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. మరికొందరైతే సమంతే విడాకులకు కారణమంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, సామ్ వాటిపై ప్రత్యక్షంగా స్పందించకపోయినా…పరోక్షంగా కౌంటర్లు ఇస్తూనే ఉంది. అయినా సరే కొంతమంది నెటిజన్లు పదే పదే…ఆ విడాకుల మ్యాటర్ పై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారట. దీంతో, చిర్రెత్తిపోయిన సామ్…సంచలన నిర్ణయం తీసుకోబోతోందని పుకార్లు వినిపిస్తున్నాయి.
విడాకుల తర్వాత సమంత మరో షాకింగ్ డెసిషన్ తీసుకోనుందని తెలుస్తోంది. త్వరలోనే సమంత సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్ కు సామ్ గుడ్ బై చెప్పబోతోందట. ఇప్పటికే విడాకుల వల్ల కొంత డిస్టర్బ్ అయిన సామ్ ను కొంతమంది ట్రోల్స్ మరింత డిస్టర్బ్ చేస్తున్నాయట. అలా అని అందరికీ సమాధానం ఇచ్చుకుంటూ పోలేమని సామ్ డిసైడ్ అయిందట. అందుకే, తన ఎమోషన్స్ తో సంబంధం లేకుండా కొందరు నెటిజన్లు కామెంట్ల నుంచి విముక్తి పొందేందుకు సమంత ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుందట. మరి, ఈ పుకార్లలో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.