అమెరికాలోని భారత సంతతి తెలుగు విద్యార్థిని అనిక చేబ్రోలుకి 3ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ టైటిల్ దక్కింది. కరోనావైరస్ కి చికిత్స కోసం ఆమె చేసిన పరిశోధనలపై చేసిన ఆమె కృషి ఈ విజయాన్ని సాధించిపెట్టింది. ఆమెను 25,000 డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. COVID-19 చికిత్స ఔషధంపై చేసిన కృషికి టెక్సాస్‌కు చెందిన 14 ఏళ్ల అనికా చేబ్రోలు కు 2020 ఏడాదికి గాను 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్‌ను గెలుచుకున్నట్లు సిఎన్ఎన్ తెలిపింది.
అనిక చేబ్రోలు పాఠశాల విద్యార్థి. ఈ స్థాయిలోనే కరోనావైరస్ పై పోరాటంలో ఆమె ఒక గొప్ప మైలు రాయిని సాధించింది. కరోనా వైరస్ ప్రొటీన్ కొవ్వులా ఉండే ఒక అణువు అని తెలిసిందేగా. అలాంటో కరోనా వైరస్ అణువును ఒక నిర్దిష్ట ప్రోటీన్‌తో బంధించి పనిచేయకుండా నిరోధించే ఒక అణువును అనిక అభివృద్ధి చేసింది.
“నేను SARS-CoV-2 వైరస్‌పై ఒక నిర్దిష్ట ప్రోటీన్‌తో బంధించగల ఈ అణువును అభివృద్ధి చేసాను. ఈ ప్రోటీన్‌ను బంధించడం ద్వారా అది ప్రోటీన్ యొక్క పనితీరును నిలిపివేస్తుంది” అని ఎనిమిదవ తరగతి చదువుతున్న అనిక పేర్కొంది.
ఒకరోజు వైద్య పరిశోధకురాలిగా, ప్రొఫెసర్‌గా ఉండాలని ఆశిస్తున్న అనికా, తన తాత సైన్స్ పట్ల తనకున్న ఆసక్తిని ప్రోత్సహించారని అన్నారు.
“మా తాత, చిన్నతనంలోనే నా ఆసక్తిని గమనించారు. అందుకే నన్ను ఎప్పుడూ సైన్స్ వైపు నెట్టేవాడు. అతను నిజానికి కెమిస్ట్రీ ప్రొఫెసర్, అతను మార్గదర్శకత్వం వల్లే నేను దీనిపై ఆసక్తికి తగిన అవగాహన పెంచుకున్నాను‘‘ అన్నారు.
అనికకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.