బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు.. ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే కథానాయకుడిగా `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో హిట్ అందుకున్నాడు. 2021లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రదీప్.. మళ్లీ ఇప్పుడు `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దీపికా పిల్లి ఇందులో హీరోయిన్. నితిన్ – భరత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే చిత్రబృందం జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ మాచిరాజు.. తన పెళ్లి టాపిక్ పై రియాక్ట్ అయ్యాడు. గతంలో ఒక లేడీ పొలిటిషన్ తో ప్రదీప్ పెళ్లి అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రశ్నించగా.. `పెళ్లికి సంబంధించి ఎటువంటి ప్లాన్ లేదు. లైఫ్ లో సెటిల్ కావాలనుకున్నాను. నాకంటూ కొన్ని డ్రీమ్స్, టార్గెట్స్ ఉన్నాయి. వాటిని చేరుకోవడంలో ఆలస్యం కావడం వల్ల మిగతా విషయాలు కూడా వాయిదా పడుతూ వచ్చాయి. కాకపోతే అన్ని సరైన సమయానికి పూర్తి అవుతాయని నమ్ముతున్నాను.
ఇక రాజకీయ నాయకురాలితో పెళ్లి అంటూ వచ్చిన వార్తలు నేను విన్నాను. అంతకన్నాముందు రియల్ ఎస్టేట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో పెళ్లి అని రాశారు. త్వరలో క్రికెటర్‌తో పెళ్ళంటారేమో.. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను` అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రదీప్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.