మీడియాను, సోషల్ మీడియాను కెలుక్కుని వార్తలకు ఎక్కడంలో అనసూయ నెం.1
ఎంతైనా జర్నలిజం నుంచి సినిమాల్లోకి వెళ్లిన వ్యక్తి కదా… ఆమాత్రం ఆ ఇన్ స్టింక్ట్ ఉంటుంది
నెటిజన్లకు అనసూయ కంటే ఎక్కువగా ఎవరూ స్పందించరు.
వాళ్లు ఏదో ఒకటి అనాలి.. నేను వారికి గట్టి రిప్లై ఇవ్వాలి అనేటువంటి సందర్భంలోనే ఆమె ఆన్లైన్లోకి వస్తూంటుంది.
ఇది కాకతాళీయమనుకుంటాం కాని స్ట్రాటజీ అని కొందరంటారు.
తాజాగా ఒక జర్నలిస్టు తన వయసును 40 ఏళ్లు అని తప్పుగా రాసిందని గోలగోల చేస్తోంది అనసూయ.
తన వయసు 40 కాదు, 36 మాత్రమే అని చెప్పుకొచ్చింది అనసూయ.
వయసు పెరగకుండా ఉండదు. చెప్పుకోవడానికి సిగ్గుపడను. అలా అని లేనిది చెప్పేస్తే ఎలా అంటోంది
యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ భరద్వాజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా విజయవంతంగా స్థిరపడింది.
జబర్దస్త్ కామెడీ షోకు హోస్టింగ్ చేస్తూ తన సొంత ఆకర్షణను జోడించడంతో ఆమె-షో రెండూ ఫేమస్ అయిపోయాయి.
జబర్దస్త్ లో రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ అనసూయ స్పందిస్తూ ఉంటుంది.