జూలై 12న ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అత్యంత సంపన్నుడు, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తన కుమారుడి పరిణయ మహోత్సవం కోసం దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ కార్యక్రమాల్లో అనంత్ అంబానీ వెడ్డింగ్ ఒకటని అంటున్నారు.
రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, దేశాధినేతలు, క్రీడా ప్రముఖులు, సినిమా స్టార్లతో అంబానీ పెళ్లి వేడుక కళకళలాడింది. అయితే పెళ్లి రోజు అనంత్ అంబానీ ధరించిన షేర్వానీ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. గోల్డ్ మరియు డైమండ్స్ తో తయారు చేయబడిన షేర్వానీని అనంత్ అంబానీ తన వివాహం రోజు ధరించారు. ఈ షేర్వానీ విలువ అక్షరాల రూ. 200 కోట్లు అని చెబుతున్నారు.
అలాగే అనంత్ అంబానీ డైమండ్స్ షేర్వానీకి ఒక ఎలిఫెంట్ బ్రూచ్ ఉంది. దాని ఖరీదు రూ. 14 కోట్లు. ఇక పెళ్లి రోజు ఆయన తన చేతికి రిచర్డ్ మిల్లే RM 52-05 టూర్‌బిల్లాన్ ఫారెల్ విలియమ్స్ వాచ్ ను ధరించగా.. దాని మార్కెట్ విలువ సుమారు రూ. 54 కోట్లు. ఈ విషయాలు తెలుసుకుంటున్న నెటిజన్లకు ప్యూజులు ఎగిరిపోతున్నాయి. ముఖ్యంగా ఒక షేర్వానీ కోసం రూ. 200 కోట్లు ఖర్చు పెట్టారని తెలీయడంతో.. ఎంతైనా అంబానీలు అంటే ఆ మాత్రం ఉంటుందంటూ చర్చించుకుంటున్నారు.