పైకి చూస్తే… మేడిపండు చాలా అందంగా.. లేత గులాబీ రంగులో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ, దాని పొట్ట విప్పితే.. ఎలాంటి పరిస్థితి ఉంటుందో అందరికీ తెలిసిందే. అలానే.. ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వ్యవహరించారని అంటున్నారు పరిశీలకులు.. అయితే.. ఇది కొంత రివర్స్. మనసులో మాత్రం.. పొగుడుతూ.. పైకిమాత్రం ఆయన మాటల తూటాలు పేల్చారు. అది కూడా ఏపీ సీఎం జగన్ గురించే కావడం గమనార్హం.
తాజాగా విశాఖ పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్షా.. సీఎం జగన్పై విరుచుకుపడ్డారు.. అవినీతి పెరిగిపో యిందని… రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని.. రాజధాని లేకుండా పోయిందని కన్నీటి పర్యంత మయ్యా రు. ఈ క్రమంలోనే మాటల శరాలతో జగన్పై విరుచుకుపడ్డారు. పైకి విషయం తెలియనివారు అమిత్ షా విరుచుకుపడ్డారు… జగన్కు మూడిందన్నమాటే అనుకున్నారు.
కానీ, వాస్తవం చూస్తే… అమిత్ షాకు అన్నీ తెలుసునన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఏపీలో ఏం జరు గుతోందో.. ఏపీలో ఎంత అవినీతి ఉందో అన్నీ ఆయనకు కూలంకషంగా తెలుసు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుడు.. ఇంత జరుగుతోందని గుండెలు బాదుకుంటున్న మంత్రి వర్యులు ఇప్పటి వరకు ఏం చేశారు ? జగన్ను కానీ.. ఇక్కడ జరుగుతున్న అవినీతిని కానీ నిలువరించే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే. లేదు.
కానీ, ఇప్పుడు మాత్రం ఇక్కడ అవినీతి జరుగుతోంది.. ఇసుక దోచేస్తున్నారు.. విశాఖను కబ్జా చేస్తున్నారు. అనిమాత్రం చెప్పుకొచ్చారు. అంటే.. ఇవి మాటల తూటాలా.. లేక మాటల మల్లె మొగ్గలా ? అనే ప్రశ్న తెరమీదకి వచ్చింది. అంటే… నిజానికి కేంద్రం ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ అవసరం ఎంతైనా ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ జగన్తో పని ఉంది. సో… ఆయనను ఏమీ అనలేని పరిస్థితి . కానీ, ఓటు బ్యాంకు రాజకీయం మాత్రంకావాలి … కాబట్టి షా ఇలా వ్యాఖ్యాననించారని అంటున్నారు పరిశీలకులు.