అమెరికా లో ప్రవాసాంధ్రుడి హఠాత్మరణం! ఉత్తర అమెరికా తెలుగు సంఘం, నాట్స్ (NATS) ఔదార్యం!

NRI Oct 07, 2020

అమెరికా లోని న్యూ జెర్సీ, ప్లేయిన్స్బోరో లో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది.  ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం పట్టణానికి చెందిన మసూద్ అలీ (40) గుండెపోటుతో మృతి చెందారు.  మసూద్ అలీ, భార్య అయేషా, 7 ఏళ్ల కుమార్తె ఆర్షియా తో గత కొంత కాలం గా న్యూజెర్సీ లో నివసిస్తున్నారు!  అక్టోబరు 1 న తన కుమార్తె పుట్టినరోజు కావడం తో, ముందు రోజు బెలూన్ల తో అలంకరించడానికి తన అపార్ట్మెంట్ బయటకు వచ్చిన మసూద్ అలీ అకస్మాతుగా గుండె పోటుకు గురై కుప్పకూలిపోయారు. హుటాహుటిన మసూద్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మసూద్ అలీ కుటుంబానికి అమెరికా లో దగ్గరి బంధువులు కానీ, సన్నిహితులు కానీ ఎవరు/ రూ లేకపోవడం విచారకరం.  తన భార్య అయేషా, కుమార్తె ఆషియా గత కొన్ని నెలల క్రితమే అమెరికా కి వచ్చారు.

మసూద్ అలీ ఆకస్మిక మృతి తో, ఎం చెయ్యాలో తెలీని అయేషా - మసూద్ మేనేజర్ మరియు సహఉద్యోగుల సహాయం తో – నాట్స్ (NATS) హెల్ప్ లైన్ తో సంప్రదించారు.  మసూద్ పార్థివ దేహాన్ని స్వదేశానికి తరలించడానికి, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడడానికి – నాట్స్ (NATS) బృందం - ముఖ్యం గా మోహన్ కృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి, నిఖిల్ సూర్య గుత్తికొండ బాగా తోడ్పడ్డారు!  అలాగే మసూద్ అలీ కుటుంబ సహాయార్ధం ఒక గో ఫండ్ మీ కాంపెయిన్ ను ప్రారంభించి - అమెరికా వ్యాప్తం గా లక్ష కు పైగా డాలర్లను విరాళాల రూపం లో సేకరించారు!

నాట్స్ బృందం సహాయం తో - తన భర్త మృత దేహం తో అయేషా సోమవారం తమ స్వస్థలం అనంతపురం చేరుకున్నారు.  దురదృష్టవశాత్తు మసూద్ అలీ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి ఆసుపత్రిలో ఉండగా, చివరి సారిగా మసూద్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఎవ్వరు చూడలేక పోయారు. కేవలం ఒక సోదరుడి సమక్షం లో మసూద్ మృతదేహాన్ని ఖననం చేయడం చాలా విచారకరం!

అమెరికా లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ - అమాన బృందం - మసూద్ అలీ కుటుంబానికి నాట్స్ (NATS) అందించిన సహాయాయనికి కృతఙ్యతలు తెలిపారు!  కష్టాలలో ఉన్న సాటి తెలుగు వారికి అన్ని రకాలసహాయ సహకారాలు అందిస్తున్న నాట్స్ వారికి ముఖ్యం గా - ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని ప్రెసిడెంట్ విజయశేఖర్ అన్నే, నాట్స్ బోర్డు డైరెక్టర్ మోహన్ కృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు!  ఈ సందర్భం గా అమాన బోర్డు అఫ్ ట్రస్టీస్ ఛైర్మెన్ - ఇక్బాల్ మరియు అమాన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖుద్దూస్, న్యూజెర్సీ లో స్థానికం గా మసూద్ అలీ కుటుంబాన్ని కలిసి పరామర్శ అందించిన - బాషా సయ్యద్, ఇనాయత్ ఖాన్, కలం సయ్యద్, మరియు మసూద్ అలీ భార్య అయేషా కు మానసిక స్థైర్యాన్ని అందించిన డాక్టర్ అంజుమ్, హసీనా సయ్యద్  లకు ధన్యావాదాలు తెలిపారు!

అమాన తరపున ఇక్బాల్, NATS ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, ప్రెసిడెంట్ విజయశేఖర్ అన్నే ల తో ఫోను లో ప్రత్యేకంగ మాట్లాడి మున్ముందు కూడ NATS చేపట్టే మంచి కార్యకలాపాలకి అమాన సహయ సహకారాలు ఉంటాయని చెప్పారు.

https://www.gofundme.com/f/Masood-Ali-Family-Support

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.