అమరావతి మహా పాదయాత్ర లో ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది.
అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై నేటికి 700 రోజులు. ఒక అసాధారణ, అపూర్వ పోరాటంగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.
ప్రతిరోజు యాత్ర ప్రారంభమయ్యే సమయానికి చిరుజల్లులు, ఆ తర్వాత పూలవర్షం మామూలు విషయం.
అయితే ఈ రోజు యాత్ర ప్రారంభ సమయంలో పెద్ద వాన రావడం వలన, కొద్దిగా ఆలస్యంగా… విక్కిరాల పేట నుండి ప్రారంభమైన మహా పాదయాత్ర… కొండి కందుకూరు, బొడపాటి వారి కొష్టాలు, లుంబిని వనం, ముప్పరాజు వారి కొ
ష్టాలు మీదుగా కందుకూరు పట్టణానికి చేరుకుంది.
ఉదయం నుంచే వేలాది మంది తో సాగిన మహా పాదయాత్ర, కందుకూరు పట్టణం చేరుకునే సమయానికి జన సముద్రం అయింది. సుమారు 20 నుంచి 25 వేల మంది మహా పాదయాత్ర లో పాల్గొనడం ఒక చారిత్రాత్మక ఘట్టం.
కందుకూరు మహాపాదయాత్ర లో పాఠశాల, కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొనడం… ఉద్యమాన్ని… ప్రజా ఉద్యమంగా మార్చింది.
ఈరోజు రూట్ మ్యాప్ లో ఉన్న ప్రతి గ్రామంలో స్త్రీలు పురుషులు వేలాది మంది పాదయాత్రలో పాల్గొని అమరావతి ఆకాంక్షను బలంగా వినిపించారు.
దారిపొడవునా పూలవర్షం…
ఏ నోట విన్నా అమరావతికి హర్షం…
మధ్య మధ్య లో కురిసిన వర్షం…
అయినా ఆగని జన ప్రభంజనం.
ఈ జన ప్రపంచానికి తోడు… అమరావతి పరిరక్షణ ఉద్యమం లో మొదటి నుండి అగ్రభాగాన నిలుస్తున్న సుంకర పద్మశ్రీ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు, జంగా అజయ్ కుమార్ గారు, తాడికొండ మాజీ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బండ్లమూడి పూర్ణచంద్ర రావు గారు, చలసాని శ్రీనివాస్ గారు, వెలగపూడి గోపాల కృష్ణ ప్రసాద్ గారు, సామాజిక ఉద్యమ కారుడు టీ లక్ష్మీనారాయణ గారు, బాలకోటయ్య గారు, విజయవాడ జనసేన నాయకులు రావి శ్రీనివాస్ గారు, రావి సౌజన్య గారు
అలాగే స్థానిక నాయకులైన మాజీ శాసనసభ్యులు దివి శివరాం గారు, వారి శ్రీమతి గారు, కొండేపి శాసనసభ్యులు స్వామి గారు, కొండేపి యువ నాయకుడు దామచర్ల సత్య గారు, కందుకూరు దళిత నాయకులు గోచి పోతల మోసే గారు, రాయపాటి శ్రీనివాస్ గారు, రెబ్బ వరపు మాల్యాద్రి గారు పాల్గొనడం జరిగింది.
ఒక బ్యాంకు మేనేజర్, ఒక హై స్కూల్ హెడ్మాస్టర్ ఈ రోజు పాదయాత్రలో పాల్గొని, ప్రస్తుత పరిస్థితులపై వారి ఆవేదనను నాతో పంచుకున్నారు.
పాదయాత్రలో నాతోపాటు నడిచిన తన క్లాస్ మేట్ ద్వారా ఫోన్లో సంఘీభావం తెలియజేసిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గారు.
కొలికపూడి శ్రీనివాసరావు