షాకింగ్‌.. బీజేపీ విష్ణను లైవ్ లో చెప్పుతో కొట్టారు

టీవీ చ‌ర్చ‌ల్లో రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య వాదోప‌వాదాలు కొన్నిసార్లు శ్రుతి మించిపోవ‌డం.. తీవ్ర స్థాయిలో దూష‌ణ‌ల‌కు దిగ‌డం మామూలే. కొన్నిసార్లు ఒక‌రి మీద ఒక‌రు చేయి చేసుకునేవ‌ర‌కు కూడా ప‌రిస్థితులు వెళ్లిపోతుంటాయి. తాజాగా ఓ తెలుగు టీవీ ఛానెల్లో ఇలాంటి హ‌ఠాత్ ప‌రిణామ‌మే చోటు చేసుకుంది. ఓ నాయ‌కుడు.. మ‌రో నేత‌ను ఏకంగా చెప్పుతో కొట్టేయ‌డం సంచ‌ల‌నం రేపింది. ఇక్క‌డ ఆ దెబ్బ తిన్న‌ది ఆంధ్రా బీజేపీ ప్ర‌ముఖ నేత‌ల్లో ఒక‌రైన విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి కావడం గ‌మ‌నార్హం.

ఓ రాజ‌కీయ చర్చ‌లో భాగంగా అమ‌రావ‌తికి సంబంధించిన అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌పుడు.. కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనే నేత తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఆయ‌న అమ‌రావ‌తి రైతు ప‌రిర‌క్షణ వేదికకు సంబంధించిన నాయ‌కుడిగా చెబుతున్నారు. చర్చ‌లో భాగంగా అమరావతి కి మ‌ద్ద‌తుగా శ్రీనివాస‌రావు మాట్లాడ‌టంతో విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఆగ్ర‌హానికి గుర‌య్యారు.
అలా అయితే తెలుగుదేశం పార్టీలో చేరు, ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లి మాట్లాడుకో అన్నారు. అంత‌టితో ఆగ‌కుండా నేను నీలా తెలుగుదేశం పార్టీకి మద్ద‌తుగా మాట్లాడాలా.. పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడాలా అంటూ గ‌ద్దించారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన శ్రీనివాస‌రావు త‌న ఎడ‌మ కాలికి ఉన్న చెప్పును తీశారు. ప‌క్క‌నున్న టీవీ ఛానెల్ హోస్ట్ వ‌ద్దు వ‌ద్దు అని ఆయ‌న్ని ఆపే ప్ర‌య‌త్నం చేస్తున్నా వినకుండా చెప్పు తీసుకుని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డిని కొట్టేశాడు శ్రీనివాస‌రావు.

ఈ ప‌రిణామంతో వీక్ష‌కులంతా షాకైపోయారు. ఈ ప‌రిణామం త‌ర్వాత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి తీవ్ర స్వ‌రంతో మాట్లాడుతూ శ్రీనివాస‌రావు మీదికి వెళ్తుండ‌గా.. ఆ కార్య‌క్ర‌మాన్ని టీవీ ఛానెల్ ఆపేసింది. ఐతే విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డిని శ్రీనివాస‌రావు చెప్పుతో కొట్టిన దృశ్యం మాత్రం సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చేసింది. అది వైరల్ అయిపోయింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.