అలర్ట్ - కరోనాతో యువ రచయిత మరణం

మరణం... ఇది అనూహ్య మరణం. కరోనా పై రోజురోజుకు జనానికి నిర్లక్ష్యం పెరుగుతోంది. మార్చిలో భయపడాల్సినదానికంటే ఎక్కువ భయపడాలి. కానీ అందరిలో నిర్లక్ష్యం పెరిగింది. కానీ కరోనా మాత్రం అప్పటి కంటే ఇపుడు బలంగా ఉంది. కాకపోతే దానిని మనం గుర్తించడం లేదు అంతే.

తాజాగా ఒక యువ రచయిత కేవలం కరోనాతో మరణించారు. వృద్ధులకే ప్రమాదం, రోగులకే ప్రమాదం అని నిర్లక్ష్యం చేయకండి. రవితేజ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ' కి  స్టోరీ రైటర్ గా పనిచేసిన టాలీవుడ్ యువ రచయిత వంశీ రాజేశ్ కరోనాతో కన్నుమూశారు.

ఆయన ఇటీవలే కరోనా బారినపడ్డారు. కోలుకున్నట్టే కోలుకుని మళ్లీ సీరియస్ అయ్యి చనిపోయారు. రెండు వారాలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఈరోజు చనిపోయారు. వంశీ మృతి పట్ల కుటుంబ సభ్యులు విషాదంలో మునగ్గా, టాలీవుడ్  చిన్న కుదుపునకు గురయ్యింది. ఎందుకంటే టాలీవుడ్లో ఒక యువకుడు చనిపోవడం ఇదే మొదటిసారి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.