సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా…ఆయన రెగ్యులర్ బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ పూర్తయింది. ఆ వ్యవహారంలో తీర్పును కోర్టు జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే, తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్ ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్ కు వర్తించదని, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు.
రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణమని, ఆయన రావడంతోనే తొక్కిసలాట జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ కు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తారని, విచారణకు సహకరించరని వాదించారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదనలు వినిపించారు.