ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ప్రొడ్యూస్ చేసిన `తండేల్` చిత్రం ఫిబ్రవరి 7న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించారు. యధార్థ సంఘటన ఆధారంగా శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ లో దేశభక్తికి ప్రేమ కథను జోడించి డైరెక్టర్ చందు మొదటి ఈ సినిమాను తెరకెక్కించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
చైతు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో నిర్మితమైన తండేల్ అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల హృదయాలను కూడా దోచుకుంది. తొలి ఆట నుంచి హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గురువారం శ్రీకాకుళంలో థాంక్యూ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు దర్శకనిర్మాతలు, హీరో హీరోయిన్ తో పాటు చిత్రబృందం మొత్తం హాజరైంది.
అయితే ఈ ఈవెంట్ లో ఓ ఆసక్తికర సీన్ చోటుచేసుకుంది. స్టేజ్ పై హీరోయిన్ సాయి పల్లవి తో నిర్మాత అల్లు అరవింద్ స్టెప్పులు వేశారు. తండేల్ మూవీలోని `హైలెస్సా.. హైలెస్సా..` అంటూ సాగే పాటకు అల్లు అరవింద్ ఎంతో హుషారుగా సాయి పల్లవి తో కలిసి డాన్స్ చేయడం అక్కడున్న వారందరినీ ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర కొడుతోంది.
Sweetest moments of Success 💗💗#Thandel @chay_akkineni @Sai_Pallavi92 #AlluAravind pic.twitter.com/HGnQ4tDlS0
— Bunny Vas (@TheBunnyVas) February 13, 2025