బాలీవుడ్లో కొన్నేళ్ల ముందు వరకు టాప్ స్టార్లలో ఒకడిగా ఉండేవాడు అక్షయ్ కుమార్. క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే ఏడాదికి మూణ్నాలుగు రిలీజ్లు ఉండేలా చూసుకుంటూ.. మినిమం గ్యారెంటీ సినిమాలు ఇస్తూ.. అప్పుడప్పుడూ బ్లాక్బస్టర్లు కొడుతూ దూసుకెళ్లేవాడు.
ఒక దశలో ఇండియాలో హైయెస్ట్ ఎర్నింగ్, హైయెస్ట్ ట్యాక్స్ పెయిడ్ యాక్టర్‌గానూ అతను రికార్డు సృష్టించాడు. అలాంటి నటుడు ఇప్పుడు కెరీర్లో అనూహ్య పతనం చవిచూస్తున్నాడు. అతడి సినిమాలకు థియేటర్లలో కనీస స్పందన ఉండట్లేదు. టాక్‌తో సంబంధం లేకుండా అక్షయ్ సినిమాలను తిరస్కరిస్తున్నారు ప్రేక్షకులు.
కరోనా టైంలో ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయి.. బాలీవుడ్లో చాలామంది హీరోల థియేట్రికల్ మార్కెట్ దెబ్బ తినేసింది. అందులో అక్షయ్ ముందు వరుసలో ఉంటాడు. అతడి చివరి సినిమా ‘సెల్ఫీ’ ఫుల్ రన్లో పది కోట్ల వసూళ్లు రాబట్టడానికి కూడా కష్టపడిపోయింది. అక్షయ్ నుంచి అంతకుముందు వచ్చిన సినిమాల పరిస్థితి కూడా అంతంతమాత్రమే.
మొత్తంగా ప్రస్తుతం అక్షయ్ భవిష్యత్తే ప్రమాదంలో పడ్డట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను తన కొత్త సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. అక్షయ్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటైన ‘ఓ మై గాడ్’కు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధమవుతోంది. ముందీ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అక్షయ్ గత చిత్రాల ఫలితాలు చూశాక ఊరికే థియేటర్లలో రిలీజ్ చేసి పేరు, డబ్బు పోగొట్టుకోవడం కన్నా.. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే మంచి డీల్ వస్తుందని చూస్తున్నారట.
గత ఏడాది కూడా కరోనా ప్రభావం లేనప్పటికీ అక్షయ్ సినిమా ‘కట్ పుట్లీ’ని ఓటీటీలో రిలీజ్ చేశారు. అలాగే ‘ఓఎంజీ-2’ను కూడా డిజిటల్ బాట పట్టించనున్నారట. వూట్-జియో సినిమా ఫ్లాట్ ఫామ్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
https://twitter.com/letscinema/status/1636234633359790082