అక్కినేని వారింట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో నాగచైతన్య ఓ ఇంటివాడు అయ్యాడు. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేశాడు. అయితే ఇప్పుడు అఖిల్ పెళ్లికి డేట్ ఫిక్స్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. చైతు-శోభితల వివాహానికి కొద్ది రోజుల ముందే ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారిణి జైనాబ్ రవ్డ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. గత కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లికి లైన్ క్లియర్ చేసుకున్నారు.
తాజాగా అఖిల్, జైనాబ్ల వివాహ తేదీని ఇరు కుటుంబసభ్యులు కలిపి ఫిక్స్ చేశారు. ఈ ఏడాది మార్చి 24న ప్రేమసి మెడలో అఖిల్ మూడు ముళ్లు వేయబోతున్నాడని తెలుస్తోంది. అక్కినేని వారింట ఇంతవరకు జరగనంత గ్రాండ్ గా ఈ పెళ్లిని జరపాలని నాగార్జున భావిస్తున్నారట. ఇటీవల నాగ చైతన్య వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
అయితే అఖిల్, జైనాబ్ ల వివాహాన్ని మాత్రం విదేశాల్లో అత్యంత వైభవంగా జరపబోతున్నారట. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకలు, స్టార్ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు అఖిల్ పెళ్లికి వచ్చేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట. కాగా, అక్కినేని వారింటికి కాబోయే చిన్న కోడలు జైనాబ్ విషయానికి వస్తే..ప్రముఖ వ్యాపారవేత్త, జేఆర్ ఇన్ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జుల్ఫీ రవ్డ్జీ కూతురు ఆమె. జుల్ఫీ రవ్డ్జీ గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా పని చేశారు.
అలాగే నాగార్జున, జుల్ఫీ రవ్డ్జీ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక జైనాబ్ పుట్టింది హైదరాబాద్లోనే అయినా.. లండన్, దుబాయ్, ముంబైలోనే. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వయసులో అఖిల్ కంటే జైనాబ్ పెద్దిది. అఖిల్ వయసు 30 కాగా.. జైనాబ్ కు 39 ఏళ్లు. అయితే ఈ జంట తమ ప్రేమ, పెళ్లికి ఏజ్ అడ్డుకాదని భావించారు.