బాలయ్య బాక్సాఫీసులను కలెక్షన్లతో బద్దలు కొట్టేశాడు. కరోనాతో డీలా పడి నిరాశతో నిండిపోయి ఉన్న బాక్సాఫీసులకు పూనకం తెప్పించాడు బాలయ్య. బాలయ్య సినిమాలు ఎక్కువగా ఫ్యాన్స్ లేదా ఫ్యామిలీస్ ఆదరిస్తాయి. కానీ ‘అఖండ’ వారు వీరు అన్న తేడాలేకుండా ప్రతి సినిమా ప్రేక్షకుడిని ఆకర్షించింది.
ఓవర్సీస్ లో తన పాత రికార్డులను అన్నిటినీ బాలయ్య చెరిపేశాడు. ఓవర్సీస్ లో రాబోయే భారతీయ సినిమాలకు మార్గం సుగమం చేసి రెడ్ కార్పెట్ పరిచాడు బాలయ్య. ఓటీటీ ఎన్నటికీ థియేటర్ ఉత్సాహానికి సమానం కాదని నిరూపిస్తూ ప్రేక్షకుడికి థియేటర్లో సినిమా చూడాలన్న కసిని నింపాడు ‘అఖండ’.
ఈ’ అఖండ’ విజయోత్సవాలను చికాగోలో ఎన్నారైలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ‘బౌల్ ఒ బిర్యానీ’ (Bowl O Biryani) రెస్టారెంట్ లో చికాగో ఎన్.బి.కె. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సినిమా విజయోత్సవాలు జరుపుకున్నారు. ‘హేమ కానూరి’ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయోత్సవాలకు ఎన్నారైలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
శ్రీ హర్ష జమ్ముల, వెంకట్ యలమంచలి, మహేష్ కాకరాల, శ్రీనివాస్ అదాసాడ, రఘు చిలుకూరి, విజయ్ కొర్రపాటి, హనుమంత్ చెరుకూరి, మూర్తి కొప్పాక, రవి చిగురుపాటి, ప్రవీణ్ వేములపల్లి, శ్రీనివాస్ పడమల్లు, సతీష్ వున్నం,కృష్ణ మోహన్ మరియు మనోహర్ పాములపాటి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడకకు వేదిక అయినందుకు ‘బౌల్ ఒ బిర్యానీ’ మేనేజ్ మెంట్ కు ఎన్బీకే అభిమానులు ప్రత్యేక కృతజ్జతలు తెలిపారు.