పీవీ నరసింహారావు, నందమూరి తారకరామారావు… ఈ రెండు తెలుగు పేర్లు ఒక వైబ్రేషన్. తెలుగు వారిలో వీరిని వ్యతిరేకించే వారు తక్కువ. ఇష్టపడేవారు చాలా ఎక్కువ. వీళ్లిద్దరికి ఒక పోలిక ఉంది. రజకార్ల వారసుల అడ్డగా విలసిల్లుతున్న హైదరాబాదును తెలుగు వారికి ఆలవాలంగా మార్చడానికి ఎన్టీఆర్, పీవీఆర్ లే కారణం.
పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ హయాంలో హిందు జనాభా ఇక్కడ విపరీతంగా పెరిగేలా శాంతి భద్రతలు పెంపొందించి చర్యలు తీసుకున్నారు. దీంతో వారంటే ఎంఐఎం కి కోపం. ఈ విషయం చాలామందికి తెలియదు.
బీజేపీ దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎంఐఎం టక్కున తన మనసులో మాటను బయటపెట్టేసింది. అక్బరుద్దీన్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్లు హైదరాబాదులో పీకేయాలి అని వాగేశాడు. అంతే ఒక్కసారిగా అందరూ ఎంఐఎం మీద ఉమ్మడి దాడికి దిగారు. దీంతో దాని మిత్రుడు అయిన టీఆర్ఎస్ ఉలిక్కిపడింది. వెంటనే అక్బరుద్దీన్ మాటలను కేటీఆర్ ఖండించారు గాని ఒక్క కౌంటరు కూడా ఇవ్వలేదు. వారిద్దరి సాన్నిహిత్యం అలాంటిది. కేటీఆర్ లౌకికవాది కదా, అందుకే ఆయనకు అక్బరుద్దీన్ పై కోపం రాదు.
కానీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్బురుద్దీన్ కి పిచ్చెక్కె వార్నింగ్ ఇచ్చారు. ఏయ్ అక్బర్… నువ్వు ఆ పని చేస్తే రెండు గంటల్లోనే నీ దారుస్సలాం భవనాన్ని కూల్చుతాం అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సంజయ్ వార్నింగ్ వైరల్ అవుతోంది.ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చివేస్తామనడం ఒవైసీకి తగదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం, ఎన్నికలను రాజకీయంగానే చూడాలి తప్ప, ఇష్టానుసారం మాట్లాడితే ఎవడూ ఊరుకోడు అని గోరంట్ల హెచ్చరించారు. ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాను అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ghmc ఎన్నికల సందర్భంగా బీజేపీ మంచి ఊపు మీద ఉంది. ఎంఐఎం పార్టీ స్నేహితుడు అయిన టీఆర్ఎస్ బీజేపీ దెబ్బకు బెంబేలెత్తిపోతోంది. ఎంఐఎం… రోహింగ్యాలను ప్రోత్సహిస్తోందని, వారికి టీఆర్ఎస్ గవర్నమెంట్ సహకరిస్తుందన్నది బీజేపీ ఆరోపణ. దీంతో పిచ్చెక్కిపోయిన అసదుద్దీన్, అక్బరుద్దీన్ లు నోటికొచ్చినట్లు మాట్లాడి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఎంఐఎంను తీవ్రంగా అణచివేసిన ఎన్టీఆర్ పై నోరు జారి MIM తాజాగా డిఫెన్సులో పడిపోయింది.