కరోనాతో థియేటర్లకు దూరమై ఓటీటీలకు దగ్గరైన ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకువచ్చిన సినిమా అఖండ.
విడుదలైన వెంటనే భారీ హిట్ టాక్ వచ్చిన ఈ సినిమా తిరుగులేని రికార్డులు సృష్టించింది.
చివరకు ఓటీటీలో విడుదలైనా అక్కడా రికార్డులు బద్దలు కొట్టేసింది.
అందరూ మరిచిపోయి చరిత్రలో కలిసిపోయిన 50 రోజుల దినోత్సవాలను జరుపుకున్న ఏకైక సినిమా అఖండ.
ఈ సినిమా హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన హక్కులు బాలీవుడ్ నిర్మాతలు కొనేశారు.
అయితే, హిందు ఆధ్యాత్మిక చింతన, ఆలయ విశేషాలను మాస్ ప్రేక్షకులకు ఎక్కేలా తీసిన ఈ సినిమాను బాలీవుడ్లో తీయించాలని బీజేపీ ఉత్సాహంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల లోపే ఈ సినిమా బాలీవుడ్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకే చకచకా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
అయితే, హిందీలో అఖండ పాత్ర ఎవరు చేస్తారు అన్న చర్చ మొదలై చాలాకాలం అయ్యింది.
అయితే, ఇద్దరు హీరోలు దీనికి ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ఒకరు అజయ్ దేవగణ్, మరొకరు అక్షయ్ కుమార్. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు అఖండ చేయడం ఖాయమైపోయింది. మరి బాలీవుడ్లో అఖండ రీమేక్ ఎప్పుడు మొదలవుతుంది.? ఈ ప్రాజెక్ట్ను ఎవరు టేకప్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.