ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య గ్యాప్ ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆస్తి పంపకాల విషయంలో అన్నా చెల్లెళ్లకు గొడవ అని కొందరు…రాజకీయాలలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని అన్నతో షర్మిల విభేదించారని మరికొందరు అనుకుంటున్నారు. ఇక, తెలంగాణలో బీఆర్ఎస్ కు మద్దతుగా జగన్ వదిలిన బాణం షర్మిల అని జోరుగా ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వ్యతిరేక రెడ్డి ఓటింగ్ కాంగ్రెస్ కు కాకుండా వైఎస్సార్టీపీకి పడేందుకే షర్మిల పార్టీ పెట్టారని టాక్.
ఇన్ని ప్రచారాల నడుమ తెలంగాణలో పార్టీ దుకాణం ఎత్తేసిన షర్మిల తాజాగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో అన్న జగన్ కు పోటీగా షర్మిల రాజకీయం చేయబోతున్నారు. అయితే, అసలు జగన్, షర్మిలల మధ్య గొడవే లేదని చాలామంది అనుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ కు మద్దతుగానే షర్మిలను జగన్ పంపారని, అక్కడ ప్లాన్ వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఏపీలో తనకు అవసరం ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ లో చేర్పించారని పుకార్లు వస్తున్నాయి.
జనసేనను సింగిల్ గా పోటీ చేయమని సవాళ్లు విసిరినా ఫలితం లేకపోవడంతో షర్మిలను ప్లాన్ బీ కింద ప్రయోగించబోతున్నారని టాక్. వైసీపీ, జగన్ పై వ్యతిరేకత ఉన్న నేతలు కాంగ్రెస్ లో చేరతారని జగన్ అంచనా వేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో జగన్, షర్మిలల మధ్య జరిగిన సంభాషణ ఇది అంటూ ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అన్నాచెల్లెళ్ల మధ్య మైండ్ బ్లోయింగ్ అగ్రిమెంట్ జరిగిందని గాసిప్ ఒకటి ట్రెండ్ అవుతోంది.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ యధాతథంగా….
జగన్, షర్మిలల మధ్య మైండ్ బ్లోయింగ్ అగ్రిమెంట్….
జగన్ : షర్మిల పాప నీకు ఆస్తి సెటిల్ చేస్తాను. కానీ ఒక కండిషన్.
షర్మిల : నాకు నాన్న ప్రామిస్ చేసినదంతా ఇవ్వాలి.
జగన్ : దానికంటే 1 పర్సెంట్ ఎక్కువే ఇస్తాను, కానీ ఒక కండిషన్ కు నువ్వు ఒప్పుకోవాలి.
షర్మిల : ఎలా నమ్మేది.
జగన్ : ఇంకోసారి సీఎం సీటు వస్తే నేను నీకిచ్చిన దానికంటే ఎక్కువ ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు. కాబట్టి ఇంకోసారి నాకు సీఎం సీటు దక్కేలా ఒక ప్లాన్ వేశాను. నువ్వు దానికి ఒప్పుకుంటే 70 శాతం ఎన్నికల ముందే ఇస్తాను. మిగతా 30 శాతం ఎన్నికల తర్వాత ఇస్తాను.
షర్మిల : నేను ఏంచేయాలి.
జగన్ : కాపులకు, కమ్మలకు గొడవలు పెట్టి పవన్ ను ఒంటరిగా పోటీ చేసేలా రెచ్చగొట్టాను కానీ వర్కవుట్ కాలేదు. పైగా 2029లో మోడీ రావొచ్చు రాకపోవచ్చు. నేనిపుడు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వలేను. మోడీకి మద్దతు ఇవ్వకుండా ఉండలేను. మోడీకి మద్దతు ఇస్తే తర్వాత కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మన కుటుంబం తరఫున నువ్వు కాంగ్రెస్ కి హెల్ప్ చెయ్యి. నేను మోడీకి హెల్ప్ చేస్తాను. అపుడు మనకు రెండు వైపుల నుంచి ఏ సమస్య ఉండదు. నా దగ్గర నుంచి చీలే ఓట్లు నీకు పడాలి. నా దగ్గర నమ్మకస్తులు కొందరు నీ ద్వారా గెలవాలి. మెల్లగా మూడో ప్రత్య్యామ్నాయంగా కాంగ్రెస్ ను తయారుచేస్తే 2029లో కాంగ్రెస్, వైసీపీ పొత్తుతో మూడోసారి అధికారంలోకి రావచ్చు. అంటే ఒక ప్లాన్ తో మనం రెండు ఎలక్సన్లు గెలవచ్చు. ఒకవేళ ఈసారి గెలవకపోయినా నువ్వు పోటీ చేయడం ద్వారా నా హేటర్స్ లో కొందరు అయినా టీడీపీకి పోకుండా నీకు వేస్తారు. దానివల్ల 100 సీట్లకు పైన రావల్సిన టీడీపీ కూటమికి ఒక వేళ బొటాబొటి మెజారిటీతో ఆగిపోయేలా చేయొచ్చు. మన వాళ్లు ఎవరైనా అందులో గెలిస్తే వాళ్లు ఎలాగూ మన వద్దకే మళ్లీ వస్తారు. లేదా ఎవరికైనా మంత్రి పదవులు ఇచ్చి లాగొచ్చు.
షర్మిల – అంటే నీ అవసరానికి నాకు ఆస్తి ఇస్తున్నావు గాని నా హక్కు వల్ల కాదు.. మరి నీకు హెల్ప్ చేయడానికి మనసు రావడం లేదు.
జగన్ – మనం ఎన్ని కొట్టుకున్నా అన్నాచెల్లెల్లం. మోడీ ఇంకోసారి వస్తే బావకు నిధులు కూడా రావు. అదే నువ్వు నాతో ఉంటే మోడీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా ఒకరికి ఒకరు సాయం చేసుకోవచ్చు. మనమిద్దరు సహకరించుకుంటున్నట్టు ఎవరికి తెలియకుండా ఈసారి నా పాలనపై గట్టి విమర్శలు చేయు. అవి దాదాపు చంద్రబాబు, పవన్ విమర్శల్లానే ఉండాలి. న్యూట్రల్ ఓట్లన్నీ వీలైనంతగా నీకు పడాలి.
షర్మిల – నాకు కొంచెం ఆలోచించుకునే టైం కావాలి.
జగన్ – సరేనమ్మా నీకు కావల్సినంత టైం తీసుకో. నేను ఇగో కు పోయి చేసిన మిస్టేక్ నువ్వు చేయొద్దు. అదే నా సలహా. మనిద్దరం గొడవ పడితే ఇద్దరికీ నష్టం… సహకరించుకుంటే ఇద్దరికీ లాభం. బయటి వారి విషయంలో ఇగో కోసం ఎంతకైనా వెళ్తాను కూడా నీ దగ్గర కొంచెం తగ్గినా పర్లేదులే షర్మిల పాపే కదా అనుకుంటాను.