రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లూర్థుమాత చర్చిలో సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఘనంగా జరిగింది. సంక్షేమ శాఖ అధికారులతో పాటు పలువురు ఐఏఎస్ మహిళా అధికారులు హాజరయ్యారు. ఒక వీఐపీ వివాహంలో కూడా కనిపించని సందడి కనిపించింది. జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడే ఉంది. కేసీఆర్ కి నచ్చితే వ్యవహారం ఎలా ఉంటుందో ఇదే ఉదాహరణ.
ప్రత్యూష వివాహం ఉదయం 10 గంటలకు రాంనగర్‌కు చెందిన మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో సోమవారం పెండ్లి జరిగింది. తనది లవ్ మ్యారేజ్ కాదని… పెద్దలు కుదిర్చిన పెళ్లేనని ప్రత్యూష ఓ ఇంట్వర్యూలో స్పష్టం చేసింది.
ప్రత్యూషను సాక్షాత్తూ ముఖ్యమంత్రి సతీమణి శోభమ్మ పెళ్లికూతురును చేశారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలోని ఐఏఎస్ అతిథిగృహంలో ఈ వేడుక జరిగింది. సీఎం భార్య శోభమ్మ.. ప్రత్యూషకు డైమండ్ నక్లెస్, పట్టువస్త్రాలు పెట్టి ఆశీర్వాదించారు. దీంతో ప్రత్యూష ఆనందంతో పరవశించింది.
ఎవరీ ప్రత్యూష
ప్రత్యూష తల్లి చనిపోయింది. తండ్రి పట్టించుకోలేదు. దీంతో బంధువులు ఆమెను అనాధ ఆశ్రమంలో చేర్చారు. అయితే తల్లిచనిపోయే ముందు ప్రత్యూష పేరిట ఆస్తిని రాసింది. దీంతో మెజారిటీ తీరాక ఆమెను ఇంటికి తీసుకెళ్లిన తండ్రి రెండో భార్యతో కలిసి వేధించి ఆస్తి రాయించుకునే ప్రయత్నం చేశారు. అది బయటపడి కేసు అయ్యింది. ఆమెకు వాతలు పెట్టి కాల్చారు. కేసీఆర్ ఈ వార్తను చూసి ఆమెను దత్తత తీసుకుని చదివించారు. కేసీఆర్ అండతో మూడున్నర సంవత్సరాల్లో చదువు పూర్తి చేసి… వన్ ఇయర్ జాబ్ కూడా చేశానని ప్రత్యుష తెలిపింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పింది. వచ్చే నెల 20న నిమ్స్‌లో జాయిన్ అవ్వబోతున్నానని ప్రత్యూష వివరించింది.