సినీ పరిశ్రమలో కొన్ని రిలేషన్ షిప్స్ ఆసక్తి రేకెత్తిస్తాయి. అవి ప్రొఫెషనలా.. పర్సనలా అనేదే అర్థం కాదు. అడివి శేష్, సుప్రియల బంధం గురించి కూడా ఇలాంటి చర్చే జరుగుతోంది కొంతకాలంగా. వీళ్ళిద్దరూ తొలిసారిగా గూఢచారి సినిమాకు కలిసి పనిచేశారు. అడివి శేష్ హీరోగా నటించిన ఆ సినిమాలో సుప్రియ కూడా ఓ కీలక పాత్ర పోషించింది. ఆ చిత్రంలో ఆమె నిర్మాణ భాగస్వామి కూడా. ఈ సినిమా చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత సినిమాలతో సంబంధం లేకుండా వీళ్ళిద్దరూ కలిసి కనిపించారు.
దీంతో ఇద్దరి మధ్య వ్యక్తిగత బంధం ఉందనే చర్చ జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు సుప్రియ నిర్మాణంలో మరోసారి శేష్ హీరోగా సినిమా చేయబోతుండడంతో మళ్లీ వీరి బంధంపై చర్చ మొదలైంది. అడివి శేష్, శృతిహాసన్ జంటగా క్షణం, గూఢచారి చిత్రాల సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త చిత్రానికి సుప్రియనే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని లేటెస్ట్ గా అనౌన్స్ చేయగానే.. శేష్, సుప్రియ కాంబినేషన్ మీద మళ్లీ చర్చ మొదలైంది. ఇంతకుముందు అనుకున్నట్లు వీరిది వ్యక్తిగత బంధం కాదా.. ప్రొఫెషనల్ గానే వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారా సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
సుప్రియకు ఇప్పటికే వివాహం కాగా ఆమె విడాకులు తీసుకుంది. శేష్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. బహుశా సినిమాల పరంగా వీళ్ళిద్దరి వేవ్ లెంత్ కలిసి ప్రొఫెషనల్ గానే ఇద్దరు కలిసి పనిచేస్తుండొచ్చు. ప్రతి బంధాన్ని వ్యక్తిగత కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా శేష్ నటిస్తున్న కొత్త చిత్రం గూఢచారి-2 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.