నటి తరచూ వివాదాల్లో పెనవేసుకున్నట్లుగా వార్తల్లో నిలిచే వనితా విజయ్ కుమార్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
గుండె బద్ధలైందని.. మాటలు రావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. అసలు విషయాన్ని వెల్లడిస్తూ.. 20 ఏళ్ల తన అక్క కుమార్తె అనారోగ్యంతో మరణించిందని చెప్పారు. పండుగ పూట పెను విషాదంతోపాటు.. భారీ షాక్ తగిలినట్లుగా ఆమె తీరు ఉంది.
‘విషాదకరమైన కబురుతో ఉదయం నిద్ర లేచాను. 20 ఏళ్ల మేనకోడలు అనిత ఇక లేదు. న్యూఢిల్లీలో సర్జరీ చేయించిన తర్వాత గుండెపోటు రావటంతో ఆమె ప్రాణాలు పోయాయి. తను నాకు దేవుడిచ్చిన కుమార్తె లాంటిది. నాకు పెద్ద కూతురు’’ అంటూ ఆమె తనకెంత ముఖ్యమో చెప్పే ప్రయత్నం చేశారు.
తన తండ్రి సోదరుడి కుమార్తె ఇంద్ర సింగపూర్ లో ఉంటుందని.. ఆమె చిన్న కుమార్తె చనిపోయిన అనితగా.. తనకున్న బంధురికాన్ని చెప్పుకొచ్చింది. ఆమె తమ ఇంట్లో అందరికి ఇష్టమని.. వయసులో చిన్నదే అయినా.. ఎంతో దయాగుణం కలిగి ఉందన్నారు. అన్నింటిని బాగా అర్థం చేసుకునేదని.. ఎప్పుడూ తనకు మద్దతుగా నిలిచేదన్నారు.
‘‘నన్ను.. నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చింది. ఇప్పుడేమో మధ్యలోనే వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు సింగపూర్ లో ఉండటం వల్ల ఆమె డెడ్ బాడీని అక్కడికే తరలించాం’ అని పేర్కొన్నారు.
తానిప్పుడు దుబాయ్ లో ఉన్నానని.. ఇలా జరుగుతుందని తానుఅస్సలు అనుకోలేదన్న ఆమె.. ఈ నెలలోనే తామిద్దరం కలవాలని అనుకున్నట్లు చెప్పారు. తన దగ్గరే ఆమెను రెండు నెలలు ఉంచుకోవాలని భావించానని.. కానీ అంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పింది.
తన హృదయం ముక్కలైందని.. తనకు మాటలు రావడం లేదన్న వేదనను వ్యక్తి చేశారు. తానిప్పటికి ఈ విషాదాన్ని నమ్మలేకపోతున్నట్లుగా చెప్పారు.