`సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో ఇటీవల బిగ్ హిట్ అందుకుని టాలీవుడ్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన విఫల ప్రేమజ్ఞాపకాలను పంచుకుంది. గతంలో రెండుసార్లు తనకు బ్రేకప్ జరిగిందని.. ప్రేమించడం సులువే, కానీ అది విఫలమైనప్పుడు వచ్చే బాధను భరించడం, దాని నుంచి బయటపడటం చాలా కష్టమని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. `రిలేషన్షిప్ లో నేను చాలా బాధల్ని ఫేస్ చేశా. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతను నన్ను వేధింపులకు గురిచేశాడు. చేతులెత్తి కొట్టేవాడు. నేనెంతగానో ప్రేమించినవాడే నన్ను టార్చర్ పెట్టాడు. ఆ తర్వాత మేము విడిపోయాము. అంతకు ముందు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. రెండుసార్లు రిలేషన్షిప్లో ఎదురైన చేదు అనుభవాల వల్ల మళ్లీ ప్రేమలో పడాలంటే భయమేస్తుంది. ప్రస్తుతం సింగిల్ గా చాలా ప్రశాంతంగా ఉన్నాను` అంటూ బ్రేకప్ స్టోరీని రివీల్ చేసింది.
అలాగే పెళ్లెప్పుడు అన్నది తాను చెప్పలేనని.. కానీ తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే తన ఎగ్స్ ను భద్రపరిచానని ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ తెలిపింది. ఇక లైఫ్ లో తనకు తన తల్లి నాగమణినే స్ఫూర్తి అని.. ముగ్గురు అన్నలను, తనను ఆమె కష్టపడి పెంచారని, ఇప్పుడు ఆమెను మేము ఎంతో అపురూపంగా చూసుకుంటామని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది.
ఫిల్మ్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత తనకు ఇంకా మరే అవకాశాలు రాలేదని, తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఉందని ఐశ్వర్య తెలిపింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు తాను డై హార్డ్ ఫ్యాన్ అని.. డైరెక్టర్స్ రాజమౌళి, శేఖర్ కమ్మలతో కలిసి వర్క్ చేయాలని ఉందని మనసులో కోరికలను బయటపెట్టింది ఐశ్వర్య రాజేష్.