సినీ తారలు పేరు మార్చుకోవడం కొత్తేమి కాదు. స్క్రీన్ నేమ్ బాగుండాలని కొందరు, సక్సెస్ కోసం మరికొందరు పేర్లు మార్చుకుంటూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కూడా చేరారు. తెలుగుతో పాటు తమిళంలోనూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న సందీప్ కిషన్.. గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక బాగా సతమతం అవుతున్నాడు. ఇటీవల విడుదలైన ఊరు పేరు భైరవకోన మూవీ కొంత ఉపశమనాన్ని అందించినా.. సందీప్ కిషన్ గ్రాఫ్ మాత్రం పెరగలేదు.
ప్రస్తుతం ఈ హీరోగారి ఆశలన్ని తన రాబోయే చిత్రం `మజాకా`పైనే పెట్టుకున్నాడు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రావు రమేష్, మన్మథుడు ఫేమ్ అన్షు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ చిత్రమిది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మజాకా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది.
మజాకాతో బిగ్ హిట్ కొట్టాలని సందీప్ కిషన్ ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సక్సెస్ కోసం పేరు కూడా మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం ఇంగ్లీష్ నేమ్ అయిన Sundeep kishan లో `a` లెటర్ తీసేసి.. kishn గా చేంజ్ చేసుకున్నాడు. అంతేకాకుండా తన పేరుకు ముందు `పీపుల్స్ స్టార్` అనే ట్యాగ్ కూడా యాడ్ చేసుకున్నాడు. రీసెంట్ గా బయటకు వచ్చిన మజాకా మూవీ టైటిల్ పోస్టర్ తో సందీప్ పేరు మార్చుకున్న విషయం వెల్లడైంది. మరి పేరు మార్పుతో సందీప్ కు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.