సాధారణంగా రీల్ లైఫ్ లో హీరోలు పాత్రకు తగ్గట్టుగా అందులో ఒదిగిపోయి నటించి మెప్పిస్తుంటారు. అయితే, ఆన్ స్క్రీన్ పై గంభీరంగా, సీరియస్ గా కనిపించే కొందరు హీరోలు రియల్ లైఫ్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ లు రీల్ లైఫ్ లో కొంత సీరియస్ గా కనిపించినప్పటికీ…రియల్ లైఫ్ లో మాత్రం చాలా సెన్సిటివ్ గా ఉంటారట.
ఈ విషయాన్ని ఆ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించిన నటుడు సుబ్బరాజు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించాడు. ప్రభాస్ తో బుజ్జిగాడు, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించిన సుబ్బరాజు ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు. ప్రభాస్ చూడడానికి సీరియస్ గా ఉంటాడని, కానీ చాలా ఇన్నోసెంట్, సెన్సిటివ్ అని చెప్పాడు సుబ్బరాజు. ప్రభాస్ తో కలిసి పనిచేయడం ఫన్ గా ఉంటుందని సుబ్బరాజు రివీల్ చేశాడు.
ఇక, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, ఖలేజాతో పాటు మహేష్ తో కలిసి పలు చిత్రాల్లో నటించాడు సుబ్బరాజు. అయితే, ఈవెంట్లతో పాటు మీడియా ముందు చాలా సైలెంట్ గా కనిపించే మహేష్ బాబు…రియల్ లైఫ్ లో చాలా పర్ ఫెక్ట్ గా ఉంటాడట. అంతేకాదు, ప్రతి పని ఓ క్రమ పద్ధతి ప్రకారం జరిగిపోయాలని మహేష్ అనుకుంటాడట. మహేష్ చాలా సెన్సిటివ్ అని చెబుతున్నాడు సుబ్బరాజు.