`రాబిన్ హుడ్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ మూవీలో నితిన్, శ్రీలీల జంటగా నటించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక స్పెషల్ రోల్లో అలరించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన రాబిన్ హుడ్ మార్చి 28న రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. వార్నర్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు. అయితే రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు రాజేంద్రప్రసాద్ స్పీచ్ హైలెట్‌గా మారింది. స్టేజ్‌పైనే ఆయన వార్నర్ ను తిట్టేశారు. `మా వెంకీ , నితిన్ కలిసి వార్నర్ ని తీసుకొచ్చారు. అతడిని క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. వీడు మామూలోడు కాదండీ దొంగ ముండా కొడుకు.. రేయ్ వార్నర్. ఇదే నా వార్నింగ్` అంటూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ అర్థం కాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు. అయితే రాజేంద్రప్రసాద్ సరదాగానే అన్నప్పటికీ.. ఆయన అలా వార్నర్ ను తిట్టడం క్రికెట్ లవర్స్ కు ఏమాత్రం నచ్చలేదు. ఈ క్రమంలోనే రాజేంద్రప్రసాద్ వీడియోను నెట్టింట వైరల్ చేస్తూ ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. కాగా, సండే రిలీజ్ చేసిన ట్రైలర్ రాబిన్హుడ్పై మంచి హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ చివర్లో వార్నర్ కు కూడా అదిరిపోయే షాట్ పడింది.