నటసింహం నందమూరి బాలకృష్ణకు ఒక్కసారి ఎవరైనా నచ్చారంటే వారి కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్లడానికైనా ఏమాత్రం వెనకాడరు. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. అద్భుతమైన మ్యూజిక్ తో తన సినిమాల విజయంలో కీలక పాత్రను పోషిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ను అభినందిస్తూ బాలయ్య ఖరీదైన కానుకను ప్రజెంట్ చేశారు. పోర్షే కయెన్ కారును కొనుగోలు చేసి తమన్ కు గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని తమన్ ను బాలయ్య మనసారా ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలోనూ బాలయ్య ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా తమన్ తనకు తమ్ముడితో సమానమన్నారు బాలయ్యు. వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతి ఇచ్చానని.. ఫ్యూచర్ లోనూ తమ ప్రయాణం ఇలాగే కొనసాగుతోందని బాలయ్య తెలిపారు. కాగా, బాలయ్య తమన్ కు గిఫ్ట్‌గా ఇచ్చిన పోర్షే కారు సూపర్ లగ్జరీగా ఉంది. ఇండియాలో ఈ కారు బేస్ మోడల్ రూ. 1.6 కోట్ల నుంచి మొదలై రూ. 2.36 కోట్ల మధ్యన ఉంది.