ఢిల్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ.. చావు తప్పినట్టుగా.. 22 స్థానాలకు ఆప్ పరిమితం అయింది. అయితే.. ఇది పరాజయమే కానీ.. పార్టీ హవా ఏమాత్రం తగ్గలేదని.. ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆప్ కు కూడా.. వైసీపీ గతే పడుతుందని అంటు న్నారు పరిశీలకులు. ఏపీలోనూ వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన జగన్.. 11 స్థానాలకు పరిమితమ య్యారు. అక్కడ ఎలా అయితే.. సంక్షేమాన్ని అమలు చేశారో..ఇక్కడ కూడా అదే తరహాలో సంక్షేమాన్ని అమలు చేశారు.
అయినా.. కూడా ప్రజలు అవినీతి, అక్రమాలను సహించలేక పోయారన్నది.. వాస్తవం అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే.. వైసీపీని ఏపీలోనూ.. ఆప్ ను ఢిల్లీలోనూ ఓడించారు. ఇది.. నాణేనికి ఒక వైపు మాత్రమే. పార్టీలు ఓడిపోవడం, గెలవడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమే. ప్రయత్నిస్తే.. తర్వాత పుంజుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ, ఇప్పుడు ఏపీలో వైసీపీ పరిస్థితిని గమనిస్తే.. జగన్‌పై అభివృద్ది అంటే.. తెలియని నాయకుడిగా.. కేవలం డబ్బులు ఇచ్చి రాజకీయం చేసే నాయకుడిగా ముద్ర పడింది.
ఎన్నికల సమయంలో రాజకీయం కోసం ప్రత్యర్థులు ఈప్రచారం చేసినప్పుడు.. జగన్లైట్ తీసుకున్నారు. కానీ.. ఇది వాస్తవమేనని ప్రజలు నమ్మారు. ఇంకా.. నమ్ముతున్నారు. ఏ టీ కొట్టు దగ్గర విన్నా.. ఏ నలుగురు కలిసి చర్చించుకున్నా..జగన్ ఉంటే.. ఇంకా నాశనం అయ్యేవాళ్లం ! అనే మాటే వినిపిస్తుండడానికి కారణం.. జగన్ అంటే.. అభివృద్ధికి విఘాతం అనే ముద్రపడిపోవడమే. దీంతో ఈ ప్రభావం కేవలం ఎన్నికలపైనే కాదు.. వ్యక్తిగతంగా కూడా మచ్చగానే మారింది. దీనిని చెరుపుకోవడం చాలా కష్టం.
ఇక, ఢిల్లీ విషయానికి వస్తే.. ఏఅవినీతిపై పోరాటం చేశారో.. ఏ అక్రమాలపై విజృంభించారో.. అదే అవినీ తి, అదే అక్రమాలకూపంలో కేజ్రీవాల్ కూరుకుపోయారన్న చర్చ జోరుగా సాగుతోంది. అందుకే ప్రజలు ఓడించారన్న రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. పాలన బాగోపోతే.. వచ్చేసారికి సరిగ చేస్తామని ప్రజలను నమ్మించవచ్చు. కానీ, ఒక్కసారి అవినీతి, అక్రమాలు ముద్ర పడిన నాయకులు.. పైగా ప్రజలు ఈ కోణంలో నమ్మిన నాయకులుకోలుకున్న చరిత్ర ఎక్కడా లేదు. సో.. ఏపీలో వైసీపీకి పట్టిన గతే.. ఆప్‌కు కూడా పట్టనుందని అంటున్నారు పరిశీలకులు.