భూమి వైపు మహాముప్పు దూసుకువస్తోంది. మే 24న యుగాంతమే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు మే 24న ఏం జరగబోతుంది? నిజంగా యుగాంతానికి డేట్ ఫిక్స్ అయ్యిందా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భూమి వైపునకు దండయాత్ర చేసే ఆస్ట్రాయిడ్స్ ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. అలా ఈసారి భయపెట్టేందుకు మరో ఆస్ట్రాయిడ్ రెడీ అయింది.. దాని పేరే 2003 MH4. దాదాపు మూడు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం భూమి వైపుకు అంత్యంత వేగంగా దూసుకొస్తోంది.
2025 మే 24న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 4:07 గంటలకు ఆస్ట్రాయిడ్ 2003 MH4 భూమికి చాలా దగ్గరగా ప్రయాణించనుంది. 335 మీటర్లు అంటే ఐఫిల్ టవర్ కంటే పెద్దదిగా ఉన్న ఈ భారీ గ్రహశకలం సెకనుకు సుమారు 14 కిలోమీటర్లు లేదా గంటకు 50,400 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. భూమికి సుమారు 6.67 మిలియన్ కిలోమీటర్ల దూరంలో 2003 MH4 ప్రయాణించనుంది. ఒకవేళ ఈ గ్రహశకలం చిన్న డ్యాష్ ఇచ్చిందంటే భూమి తునాతునకలు అయిపోతుంది.
అయితే ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం లేదని నాసా చెబుతోంది. గ్రహశకలం భూమి సమీపించే టైమ్ లో ఆకాశం మరింత కాంతివంతంగా మెరుస్తుందని కూడా పేర్కొంది. కాకపోతే దాని పరిమాణం, వేగం మరియు భూమికి దగ్గరగా వచ్చే కక్ష్య కారణంగా శాస్త్రవేత్తలు కొంత ఆందోళన చెందుతున్నారు. భూమ్యక్షరణ వల్ల ఆ గ్రహశకలం గతి మారితే.. భూమిని ఢీకొట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మే 24న యుగాంతం అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను మరింత భయపెడుతున్నారు. కానీ, 2003 MH4 భూమికి దగ్గరగా వచ్చినా, అది భూమిని తాకే ప్రమాదం లేదని నాసా బలంగా చెబుతోంది.