బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అలకను జగన్ రెడ్డి తీర్చారు.
ఏపీ ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులకు, రెడ్లకు దారాదత్తం చేస్తున్న జగన్ రెడ్డి మరోసారి అదేబాటలో నడిచారు.
ఎంపీ సీటు ఎగ్గొట్టి వైవీకి అన్యాయం చేసిన జగన్… తర్వాత ఆయన అలకబూనడంతో టీటీడీకి ఛైర్మన్ ను చేశారు.
అనంతరం 2 సంవత్సరాలకు ఆ పదవీ కాలం అయిపోయింది.
ఇపుడు మళ్లీ అలకలో ఉన్న వైవీకి మళ్లీ జగన్ రెడ్డి అదే పదవిని కట్టబెట్టాడు.
వైవీ సుబ్బారెడ్డి టీడీడీ ఛైర్మన్ అయ్యాక అక్కడ అనేక వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే.
చివరకు గుడి అలంకరణలో కూడా క్రీస్తు శిలువను పెట్టినట్టు వివాదం అయ్యింది. తర్వాత వాటిని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.
రూముల అద్దెలు, లడ్డూ రేట్లు కూడా పెంచారు. తిరుమల భక్తుల స్వామి వారి సన్నిధిలో ఎంత సమర్పించుకోవడానికి అయినా వెనుకాడరు.
కానీ దానిని శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకో లేదా భక్తుల సదుపాయాలకో ఖర్చు చేస్తే బాగుంటుంది.
కానీ వాటిని తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఖర్చుపెట్టడమే భక్తుల మనసులను గాయపరుస్తోంది.
ఇక పోతే అలక మీద ఉన్న సుబ్బారెడ్డికి తిరిగి అత్యంత కీలకమైన టీటీడీ పదవి ఇచ్చి జగన్ సంతృప్త పరిచారు.
టీటీడీ ఛైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది.