మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజుపై ఏపీ సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఈ కారణంతో సంచయిత గజపతిరాజును తెరపైకి తెచ్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. చివరకు కోర్టు జోక్యంతో అశోక గజపతి రాజు తిరిగి మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో జగన్ పై రాజుగారు ఇప్పటికే పైచేయి సాధించానరని అంతా అనుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై రాజుగారు పై చేయి సాధించారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంల అశోక గజపతిరాజుపై నమోదైన కేసు విచారణతో పాటు తదనంతర ప్రక్రియపై హైకోర్టు తాజాగా స్టే విధించింది. తనతో పాటు మాన్సాస్ ఉద్యోగులపై నమోదైన కేసులను కొట్టివేయాలని అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…తాజాగా ఆ కేసులో స్టే విధించడంతో రాజుగారికి ఊరట లభించినట్టయింది.
మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు పునర్నియామకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సంచయిత గజపతి రాజు….డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారణకు అనుమతించే విషయంపై ఈ నెల 10న వాదనలు వింటామని డివిజనల్ బెంచ్ పేర్కొంది. అదేసమయంలో, అశోక్ గజపతిరాజు, ఉద్యోగులపై పెట్టిన కేసుకు సంబంధించి తదనంతర చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. మళ్లీ విచారణ ఎప్పుడనే విషయం ఆ ఉత్తర్వుల్లో పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.