అవును. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) కార్యాలయం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనుంది. అయితే, మీరనుకున్నట్టు జాతీయ పార్టీ కోసం అక్కడ టీఆర్ఎస్ భవన్ కట్టడం లేదు. సాధారణంగా గుర్తింపు పొందిన ప్రముఖ పార్టీలు దేశా రాజధాని ప్రాంతం అయిన ఢిల్లీలో స్థలం కోరవచ్చు. దానిని కేంద్రం పరిశీలించి స్థలాలు కేటాయిస్తుంది.
ఏదైనా కేంద్రానికి లేఖలు రాసి వ్యూహాత్మకంగా సాధించుకోవడంలో కేసీఆర్ టీఎం సిద్ధహస్తులు కదా. చాలారోజుల నుంచి కేంద్రానికి అర్జీలు పెడుతూ వచ్చారు. ఇపుడు అది నెరవేరింది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. రాజధాని న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీకి కేటాయించింది. కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా దీనిని ప్రకటించింది.
తమ పార్టీకి స్థలం కేటాయించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. న్యూఢిల్లీలో స్థలం కేటాయింపు సంతోషకరం అన్నారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఢిల్లీలో శంకుస్థాపన జరుపుతామని వెల్లడించారు. వేగంగా ఆఫీసు కడతామని చెప్పారు.