విదేశాల నుంచి నిధులు తెచ్చుకునే NGOలకు మన అమిత్ షా కొన్ని కొత్త నిబంధనలు తెచ్చారు:
1) అన్ని NGO లు – తమ బ్యాంకు అకౌంటుని ఢిల్లీలో SBI లోనే ఉంచాలి.
2) ఆ NGO లు ముందుగా Home Ministry నుంచి అనుమతి పొందాలి
3) ఆ అనుమతి పొందిన తర్వాతే బ్యాంకు అకౌంటుని తెరవబడుతుంది
4) తద్వారా – Home Ministry ఎవడెవడికి ఎంతెంత విదేశీ ధనం ఒచ్చిందో తెలిసిపోతుంది.
5) లేకపోతే, దేశవ్యాప్తంగా ఉన్న 14 లక్షల పైగా NGO లు ఎన్నో వేల బ్యాంకుల్లో ప్రభుత్వానికి తమ అకౌంట్లలో జరిగే ట్రాన్సాక్షన్లపై ఆడిట్ వివరాలను సాలీనా తెలుపకుండా సంవత్సరాల పాటు కొనసాగించడం ఇకపై కుదరదు.
ఒకే బ్యాంకు లో అకౌంట్ నడపమనడం రాజ్యాంగ విరుద్ధం అని ఒక బట్టకాయ్ కిర్సస్తానీ NGO పిటీషన్ వేసింది….
31 లక్షల NGO లు ఉన్నాయి దేశవ్యాప్తంగా!
మన దేశంలోని అన్ని విద్యాలయాల కన్నా రెండు రెట్లు ఉన్నాయి NGO లు.
మన దేశంలో హాస్పిటల్స్ సంఖ్య కన్నా 250 రెట్లు ఉన్నాయి. దేశంలోని ప్రతి 400 మందికి ఒక NGO ఉంది.
మన దేశంలోని ప్రతీ 709 మందికి ఒక పోలీసు ఉన్నాడు.
ఈ లెక్కలు అన్నీ CBI అన్నీ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుండి అధికారికంగా సేకరించినవే.
31 లక్షల NGO లు సొసైటీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసినవే.
సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం:
అసలు దేశంలో ఎన్ని NGO లు ఉన్నాయి?
అవి ఆదాయ-వ్యయ వివరాలు ఇస్తున్నాయా?
బాలెన్స్ షీట్స్ సంగతి ఏమిటీ?
ఇవన్నీ సమగ్రంగా సేకరించి తమ ముందు ఉంచాలని సుప్రీం కోర్ట్ CBI ని ఆదేశిస్తే సేకరించిన వివరాలు ఇవి.
అక్టోబర్ 1 వ తేదీన CBI ఈ వివారాలు సుప్రీం కోర్ట్ కి ఇచ్చింది. అయితే ఈ లెక్కలు ఇంకా పూర్తిగా రాలేదు.
CBI సుప్రీం కోర్టు కి ఇచ్చిన ఆఫడవిట్ ప్రకారం:
మొత్తం 26 రాష్ట్రాలు ఇచ్చిన వివరాలు మాత్రమే. ఇంకా కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలు వివరాలు ఇవ్వాల్సి ఉంది. అంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
7 కేంద్ర పాలిత ప్రాంతాలలో 82,000 NGO లు ఉన్నాయి.
2011 లో ప్లానింగ్ కమిషన్ దగ్గర ఉన్న వివరాల ప్రకారం 15 లక్షల విద్యాలయాలు [ప్రాధమిక, హైస్కూల్ కలిపి] ఉన్నట్లు ప్రకటించింది. ఈ తొమ్మిదేళ్లలో వీటి సంఖ్య ఇంకా పెరిగి ఉండవచ్చు.
మార్చ్ 2011 నాటికి దేశంలో 11,993 హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలో పడకల సంఖ్య 7 లక్షల 84 వేలు.
వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ సంఖ్య 7,347. వీటిలోని పడకల సంఖ్య లక్షా 60 వేలు.
అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ సంఖ్య 4,146.
వీటి పడకల సంఖ్య 6 లక్షల 18 వేలు.
మన దేశంలో ఉన్న పోలీసుల కంటే NGO లు ఎక్కువ ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువగా 5.48 లక్షల NGO లు ఉన్నాయి.
తరువాతి స్థానంలో మహారాష్ట్ర 5.18 లక్షల NGO లు,
మూడో స్థానంలో కేరళ 3.7 లక్షల NGO లు ఉన్నాయి.
వెస్ట్ బెంగాల్ లో 2.34 లక్షల NGO లు ఉన్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్నిటికన్నా ఎక్కువ ఢిల్లీ లో 76,000 NGOs ఉన్నాయి.
10% కన్నా తక్కువగా NGO లు ఆదాయ-వ్యయ వివరాలు ఇచ్చాయి రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ కి.
అంటే మొత్తం 31 లక్షల ఎన్జిఓ లలో 2 లక్షల 9వేల NGO లు మాత్రమే లెక్కలు ఇచ్చాయి.
అంటే 29 లక్షల NGO లు అసలు లెక్కలు ఇవ్వలేదు ఇప్పటిదాకా.
ఈ సంఖ్యలో కర్నాటక, తెలంగాణ, ఒరిస్సా రాష్టాల లెక్కలు లేవు.
కేరళలో ఉన్న NGO ల సంఖ్య 3 లక్షల 70 వేలు.
అయితే వీటిలో ఏ ఒక్కటీ కూడా లెక్కలు చూపలేదు.
విద్యలో మొదటి స్థానం అలాగే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కేరళది మొదటి స్థానం అయితే, ఈ 3 లక్షల 70 వేల NGO లు లాభాపేక్ష లేకుండా ఎవరికి సేవ చేస్తున్నాయి?
దరిద్రం ఏమిటంటే NGO లు లెక్కలు తప్పనిసరిగా చూపించాలి అని నిబంధనలు లేని రాష్ట్రాలు చాలానే ఉన్నాయి.
విదేశాల నుండి వచ్చే నిధులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి? సింపుల్. దేశ విద్రోహ చర్యలకి, రాజకీయ పార్టీలకి లోకల్ ఫండింగ్ ఏజెన్సీలుగా అలాగే మత మార్పిడులకి ఉపయోగపడుతున్నాయి. ఇదో విష వలయం. ఒకదానితో ఇంకోటి రహస్యంగా సంబంధాలు ఉంటాయి. కానీ బయటికి తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి.
పైగా వీటికి ఇచ్చే విరాళాలకి ఆదాయపన్ను మినహాయింపు ఒకటి!
వారం క్రితం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కొత్తగా ఒక నిబంధన అములులోకి తెచ్చింది.
ఏదయినా NGO దేశంలో ఎక్కడ ఉన్నా సరే వాటి బాంక్ అక్కౌంట్ ని తప్పని సరిగా ఢిల్లీ లోని State Bank of India శాఖలో తెరవాలి. ఏ విరాళం అయినా ఢిల్లీ లోని SBI శాఖలోనే జమ చేయాలి. అక్కడి నుండే డబ్బుని ఖర్చు చేయాలి.
ఇది దేశంలో ఉన్న NGO లకి మింగుడు పడట్లేదు. అంటే ఏ NGO అయినా వాటికి వచ్చే పోయే డబ్బు ఒకే బాంక్ శాఖలో ఉంటే మొత్తం బండారం బయట పడి పోతుంది.
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తెచ్చిన కొత్త రూల్ ప్రకారం అయితే తమ వ్యాపారం నడపలేమని ‘ఆమ్ణేస్టీ ఇంటెర్నేషనల్’ తమ దుకాణం మూసేసింది. పైగా ప్రభుత్వం తమని ఇబ్బందులు పెడుతున్నది అని వాపోతున్నది. లెక్కలు అడిగితే ఇబ్బందులు పెట్టినట్లా?
అసలు Amensty International అనే మానవ హక్కుల సంస్థకి పాలన పరమయిన అనుమతులు లేవని మొన్ననే కేంద్ర హోమ్ శాఖ అధికారికంగా వెల్లడించింది. అసలు కారణం ఏమిటంటే సుప్రీం కోర్టు CBI ని NGO ల వివరాలు సేకరించి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం ఒకటయితే ఢిల్లీ లోని SBI శాఖలోనే తమ లావాదేవీలు నడపాలి అన్నది రెండో కారణం ఈ మానవ కుక్కల సంఘం తమ దుకాణం మూసేయడానికి.
అల్ జీలకర్ర చానెల్ వాడు భారత్ లోని హిందూ ఫాసిస్ట్ ప్రభుత్వం ఆమ్నెస్టీ అనే మానవ హక్కుల సంఘాన్ని బలవంతంగా మూసేయించింది అంటూ తప్పుడు కధనాలు ప్రసారం చేసింది. కానీ దానికి అనుమతులు లేవు అని కానీ, అలాగే ఆదాయ-వ్యయ లెక్కలు చూపడం లేదనీ చెప్పదు.
ఎప్పుడయితే ఆమ్నేస్టీ మూత పడిందో వెంటనే దేశవ్యాప్తంగా మానభంగాలు జరగడం ఎక్కువ అవుతున్నాయి!
ఎక్కడో లింక్ మిస్ అవుతున్నట్లు లేదూ? రాహువు, ప్రియాంకా వాద్రాకి కావల్సినంత కాలక్షేపం పాపం ఢిల్లీ లోనే తమ ప్రభుత్వ హయాంలోనే అభయ మానభంగం, హత్య జరిగిందన్న స్పృహ లేదు వీళ్ళకి.అఫ్కోర్స్ అప్పట్లో Enough is Enough అంటూ NDTV బుర్ఖా దత్ నేతృత్వం లో ఓ భారీ కొవ్వొత్తుల ప్రదర్శన చేసి అంతటితో అంతా బాగు పడిపోయింది అనే నాటకం ఇంకా ప్రజల మనస్సులో నుండి పొలేదన్న సంగతి రాహువు కి తెలియదా?
అసలు “ఈ ఆమ్నెస్టీ సంస్థని 2009 లో అప్పటి మన్మోహన్ ప్రభుత్వం మూసేయమని ఆర్డర్ చేసిన సంగతి” ఏ మీడియా ఎందుకు చెప్పవు?
దాదాపుగా మూసేసినంత పని జరిగాకా లోపల లోపల ఏం జరిగిందో కానీ మళ్ళీ యధాతధంగా పనిచేయడం మొదలుపెట్టింది ఈ ఆమ్నెస్టీ సంఘం.
మనం ధన్యవాదాలు తెలపాల్సింది ఢిల్లీకి చెందిన అడ్వకేట్ శ్రీ M L Sharma గారికి.
దేశ వ్యాప్తంగా ఉన్న NGO ల అక్రమాల మీద విచారణ చేయమని ‘ప్రజా ప్రాయోజన వ్యాజ్యం’ [PIL] వేశారు. దాని మీద విచారణ చేయమని సుప్రీం కోర్టు CBI ని ఆదేశించింది. ఇప్పుడు తీగ లాగితే డొంక అంతా కదులుతున్నది. అందుకే తమ ఆదాయాలు పోతున్నాయనే అక్కసుతో నోటి నుండి అశుద్ధం కక్కుతున్నారు కొందరు.
ఇక ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి లో భారత్ మానవ హక్కులని అణిచివేస్తున్నది అంటూ విషం కక్కుతాడు చూడండి. ఎవరి లింకులు ఎక్కడనుండి ఎక్కడికి ఉన్నాయో మొత్తం వివరాలు CBI రెండు వారాల్లో లెక్కలతో సహా రెండో ఆఫడవిట్ లో ఇస్తామని సుప్రీం కోర్టుకి తెలిపింది. ఇది సుప్రీం కోర్ట్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నది కాబట్టి “పూర్తి వివరాలు ఇవ్వలేమని కానీ, అలాగే అబద్ధపు సమాచారం కానీ” ఇవ్వలేవు ఏ రాష్ట్రం కూడా.
ఉన్న డబ్బులు అయిపోయే దాకా అరుస్తారు. తరువాత అన్నీ మూసుకొని కూర్చుంటారు. ఎందుకంటే కొత్తగా విరాళాలు వచ్చే దారులు మూసుకుపోతున్నాయి కదా!
చెడు చేయాలంటే ఒక్క క్షణం చాలు అదే మంచి చేయాలంటే చాలా కాలం పడుతుంది. మంచి కోసం వేచి చూద్దాము.