ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సోలో చిత్రం `గేమ్ ఛేంజర్`. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, జయరామ్, సుశాంత్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరించారు. థమన్ మ్యూజిక్ అందించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే బయటకు టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా.. ప్రచార కార్యక్రమాలతో చిత్రబృందం మరింత హైప్ పెంచుతోంది. ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్, కియారా అద్వానీ తీసుకున్న రెమ్యునరేషన్ లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటి ప్రకారం.. ఈ పాన్ ఇండియా మూవీ కోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్న చరణ్ రూ. 65 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట.
అలాగే హీరోయిన్ కియారా అద్వానీ రూ. 7 కోట్లు పారితోషికం అందుకుందని.. డైరెక్టర్ శంకర్ కు రూ. 35 కోట్లు ముట్టచెప్పారని టాక్. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ చిత్రంగా వస్తున్న గేమ్ ఛేంజర్ ను రూ. 450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మంచి అంచనాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 122 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా సైతం సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుంటున్న గేమ్ ఛేంజర్.. ఇతర సినిమాల పోటీని తట్టుకుని సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందా? లేదా? అన్నది చూడాలి.