తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా, హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన సినిమా
‘ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ’. రైటర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రమణా రెడ్డి నిర్మాత. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కథ డిటెక్టివ్ నైపుణ్యాలు, భావోద్వేగ కథనంతో నడుస్తుంది. ఇంట్రస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను చివరి వరకు ఆకట్టుకోవడంతో పాటు అక్కడే కట్టిపడేశాయి. అందులో మిస్టరీ, కుటుంబ కథనాలు, ప్రేమ కథలను పర్ఫెక్ట్గా చూపించడంతో పాటు డైరెక్టర్ ప్రాణం పోసేలా తీశారు. ఆకట్టుకునే డిటెక్టివ్ పాత్రకు తోడు … ప్రతి సన్నివేశంలో ఆశ్చర్యకరమైన ట్విస్టులతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిందీ సినిమా. ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను చివరివరకు ఆసక్తిగా సాగుతోంది. కథలో ఎన్నో అనుకోని మలుపులు, శ్రద్ధతో నటించిన పాత్రలు ఉంటాయి. సినిమా చూస్తున్నంత సేపు ఎవ్వరూ మిస్టరీని మాత్రం ఊహించలేనంత గ్రిప్పింగ్… ఇంట్రస్టింగ్‌గా కథను నడిపించారు.
నటీనటులు:
వెన్నెల కిషోర్ డిటెక్టివ్ పాత్రలో ఇంటలిజెన్స్, భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను పిండేశాయి. ఇక అనన్య నాగళ్ విషయానికొస్తే ఎంత చెప్పినా తక్కువ. తన సింప్లిసిటీతో మరోసారి ఆకట్టుకుంది. అలావే రవి కూడా తన పాత్రలలో మరింత విలువైన నటనను ప్రదర్శించాడు. ప్రధానంగా ఆత్మీయత, కుటుంబ బంధాలను చక్కగా జోడించారు.
సాంకేతికత వర్గం:
దర్శకుడు రైటర్ మోహన్ ఈ సినిమాను కథగానే కాకుండా.. ఎమోషనల్‌గా.. చాలా డెప్త్‌గా ఆలోచించేలా చేశాడు. కథలో విషాదం, ప్రేమ, విశ్వాసం, నిజాయితీకి ఇలా అన్ని విషయాల్లో జరుగుతున్న సంఘర్షణ, పోరాటం వంటి లాంటి అంశాలను హార్ట్ టచ్ చేస్తూ మంచి అనుభూతి కలిగించాడు. యూనివర్సిల్ ఆలోచనలు ఉన్న సినిమాగా ఇది తెరకెక్కింది. సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాలో భావోద్వేగాలు మరింత కాప్చర్ చేశాయి. నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ ..
– అద్భుతమైన ట్విస్టులు, గూఢచారి కథ
– భావోద్వేగాలను హృదయపూర్వకంగా చూపిన స్క్రీన్‌ప్లే
– నటీనటుల అద్భుతమైన ప్రదర్శన
– కథను ముందుకు తీసుకెళ్లే పాటలు
మైనస్ పాయింంట్స్ ..
– కొన్ని ఎమోషనల్ సీన్లు అందరికి కనెక్ట్ కావు..
చివరగా..
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక ఆత్మీయత, భావోద్వేగాల కలిపిన స్టోరీ. ఇందులో ప్రధానంగా డిటెక్టివ్ కథతో సమన్వయంగా చూపించారు. స్క్రీన్‌ప్లే, సాంగ్స్, నటీనటుల యాక్టింగ్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఆత్మీయత, మిస్టరీ, కామెడీ సమానంగా పండింది.
రేటింగ్: 2.75/5