వైసీపీ నేత అంబటి రాంబాబును ఆంబోతు మంత్రి అంటూ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. నోటికొచ్చినట్లు ప్రతిపక్ష నేతలపై దూషణలకు దిగుతున్న అంబటిని ఆనాడు చంద్రబాబు అలా విమర్శించారు. ఈ క్రమంలోనే ఆ పేరుకు సార్థకత చేకూరేలా గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు ఆంబోతులా రంకెలేస్తూ రచ్చ చేశారు. దీంతో, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తమ పార్టీ నేతలను దూషిస్తూ టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టారని, వారిపై ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలని పోలీసులను అంబటి డిమాండ్ చేశారు. ఆ ఫిర్యాదులపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పినా వినకుండా వారితో అంబటి, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో, తమ విధులకు ఆటంకం కలిగించిన అంబటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి అత్యుత్సాహం ఆయన కొంపముంచిందని, ఇపుడు కేసు పెట్టేదాకా వెళ్లిందని కామెంట్లు వస్తున్నాయి.