నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం `అఖండ` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు సీక్వెల్ గా `అఖండ 2` ను అనౌన్స్ చేశారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా భాగం అయ్యారు. హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ కంటిన్యూ అవుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో అఖండ 2 షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఖండ 2 సినిమాతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టబోతోందట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు లయ. లయ కూతురు శ్లోక బాలయ్య సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందట.
బాలయ్య కూతురుగా ఆమె కనిపించబోతోందని.. కథలో శ్లోక పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ అప్డేట్ నిజమైతే శ్లోకకు అఖండ 2 గ్రాండ్ డెబ్యూ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా, చిత్రీకరణ దశలో ఉన్న అఖండ 2 చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.