రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడో కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఐతే ఆయనలో వేరే టాలెంట్స్ కూడా ఉన్నాయి. తనలోని నటుడిని ఆయన అప్పుడప్పుడూ బయటికి తీసుకొస్తుంటాడు. క్యామియో రోల్స్‌తో ఇప్పటికే కొన్ని చిత్రాల్తో తన నట ప్రతిభను చాటుకున్నాడు. ఆయనతో మంచి డ్యాన్సర్ కూడా ఉన్న సంగతి అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటుంది. ఈ ఏడాది వేసవిలో జరిగిన ఒక కుటుంబ వేడుకలో జక్కన్న తన భార్య రమతో కలిసి డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేసేశాడు. ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి పాటకు ఆయన వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేశాయి. ప్రొఫెషనల్ డ్యాన్సర్ తరహాలో ఆయన వేసిన స్టెప్పులకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మరోసారి జక్కన్న తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించాడు. తాజాగా మరో ఫ్యామిలీ ఈవెంట్లో ఆయన తన భార్యతో కలిసి డ్యాన్స్ వేశారు.
ఈసారి రాజమౌళి అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలోని లంచుకొస్తావా మంచెకొస్తావా పాటకు స్టెప్స్ వేశారు. షేర్వాణి వేసుకుని అందంగా తయారవడమే కాక.. డ్యాన్సుల్లో కూడా పర్ఫెక్షన్ చూపించారు జక్కన్న. ఏదో మొక్కుబడిగా రెండు స్టెప్స్ వేసి వెళ్లిపోవడం కాకుండా పాటకు లయబద్ధంగా చాలాసేపే స్టెప్స్ వేశారు. తన భార్యను రెండు చేతులతో చుట్టేస్తూ ముందుకు వెనక్కి కదులుతూ జక్కన్న వేసిన స్టెప్ అయితే వావ్ అనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకులు స్టేజ్ మీద డ్యాన్సులేయడమే అరుదు. అందులోనూ జక్కన్న స్థాయి దర్శకుడు ఇలా చేయడం మరీ అరుదు. అందులోనూ ఇంత పర్ఫెక్ట్గా స్టెప్స్ వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకుముందు డ్యాన్స్ వేయడానికి ముందు ఆయన ప్రొఫెషనల్ డ్యాన్సర్లతో కలిసి రిహార్సల్స్ చేసిన వీడియో కూడా బయటికి వచ్చింది. ఇప్పుడు మరింతగా ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ ఫ్లోర్‌ను ఇంకా షేక్ చేసేశారు. ప్రస్తుతం జక్కన్న.. మహేష్ బాబు సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.
SS Rajamouli🕺 pic.twitter.com/nA0oMfSSnm
— Manobala Vijayabalan (@ManobalaV) December 14, 2024