ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన యాక్షన్ డ్రామా `పుష్ప 2` భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 800 కోట్ల క్లబ్ చేరింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో.. వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా షేర్, రూ. 206 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా పుష్ప 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లెక్క బయటకు వచ్చింది.
వీకెండ్ ముగిసే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 చిత్రం రూ. 139.52 కోట్ల షేర్, రూ. 201.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమాకు రూ. 61.53 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చింది. అలాగే కర్ణాటకలో రూ. 31.15 కోట్లు, తమిళనాడులో రూ. 20.05 కోట్లు, కేరళలో రూ. 5.90 కోట్లు, నార్త్ మరియు రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 138.10 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి.
ఓవర్సీస్ లో పుష్ప 2 మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 75.20 కోట్లు వసూల్ చేసింది. వరల్డ్ వైడ్‌గా వీకెండ్ ముగిచే టైమ్ కు రూ. 409.92 కోట్ల షేర్, రూ. 800 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 620 కోట్లు కాగా.. 4 డేస్ లో సాలిడ్ రికవరీని సొంతం చేసుకుంది. ఇంకా రూ. 210.08 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయంటే బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 మూవీ క్లీన్ హిట్ గా నిలవడం ఖాయమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు భారీగా ఉండటం కారణంగా సామాన్యులు పుష్ప2 సినిమాకు చాలా దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి నిర్మాతలు టికెట్ ధరలను తగ్గించారు. ఇంతకు ముందు ఒక్కో టికెట్ సింగిల్ స్క్రీన్‌లో రూ.350.. మల్టీప్లెక్స్‌లో రూ.550గా ఉంది. అయితే సోమవారం నుంచి సింగిల్ స్క్రీన్‌లో రూ.200.. మల్టీప్లెక్స్‌లో రూ.350గా అందుబాటులోకి తెచ్చారు.