యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో చైతు రెండో వివాహం చేసుకున్నాడు. దాదాపు రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు సినీ ప్రముఖులు చై-శోభిత వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభిత పంచుకున్న కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన శోభిత.. కెరీర్ ఆరంభంలో ఎన్నో తిరస్కరణలు, మరెన్నో అవమానాలు ఎదుర్కొంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన ఈ తెలుగమ్మాయి భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. యాక్షన్, పీరియాడిక్ సినిమాల్లో నటించడమంటే తనకెంతో ఇష్టమంటోంది శోభిత.
అలాగే ఒత్తిడిగా అనిపించినా, మనసు బాగోగకపోయినా వెంటనే గుడికి వెళ్లిపోతుందట. తనకు భక్తి ఎక్కువని శోభిత చెబుతోంది. ఇక ఇదే క్రమంలో భర్త చైతూలో తనకు నచ్చిన మరియు తాను మెచ్చిన క్వాలిటీస్ ఏంటో రివీల్ చేసింది. చైతూలో సింప్లిసిటీ, మంచి మనసు, ఇతరుల పట్ల అతను చూపించే దయ తనను మొదట ఆకట్టుకున్నాయని శోభిత తెలిపింది. చైతు ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. ఇతరుల పట్ల మర్యాదగా, హుందాగా ప్రవర్తిస్తాడు. ఈ క్వాలిటీస్ చైతూలో తనకు బాగా నచ్చాయని శోభిత చెప్పుకొచ్చింది. అంతేకాదండోయ్.. చైతు చాలా కేరింగ్ పర్సన్ అని, తనను అమితంగా ప్రేమిస్తాడని కూడా ప్రశంసలు కురిపించింది. చైతు లాంటి హస్బెండ్ దొరకడం నిజంగా అదృష్టమే అని మురిసిపోయింది అక్కినేని కొత్త కోడలు.