‘పుష్ప 2’ బెనిఫిట్ షో వేళ.. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఆ సందర్భంగా రేవతి అనే మహిళ మరణించటం తెలిసిందే. సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ తో పాటు సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్.. నేరుగా థియేటర్ లోకి వెళ్లకుండా.. థియేటర్ పక్కనే ఉన్న క్రిస్టల్ రెస్టారెంట్ వద్ద తన వాహనాన్ని ఆపటం.. అభిమానులను ఉత్సాహపరిచేలా వ్యవహరించటం తెలిసిందే. ఈ సందర్భంలోనే బన్నీ ని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్.. అదుపు తప్పి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి.. ఆమె కుమారుడు బాధితులుగా మారారు. తొక్కిసలాటలో రేవతి మరణించగా.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతున్నాడు. ప్రస్తుతానికి క్రిటికల్ కండీషన్ లో ఉన్న అతడ్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు.
గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరగ్గా.. శుక్రవారం రాత్రి వేళలో అల్లుఅర్జున్ ఈ విషాద ఘటన మీద వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయనేం పేర్కొన్నారు? అన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
– మొన్న మేం పుష్ప సినిమా ప్రీమియర్ షోకు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లాం. అక్కడ అనుకోకుండా క్రౌడ ఎక్కువగా ఉండటం వల్ల మేం సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిందేమంటే.. నెక్ట్స్ డే మార్నింగ్, ఆ క్రౌడ్ లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీకి కొద్దిగా దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ఒక లేడీ. ఒక మదర్ ఇద్దరు పిల్లలు, రేవతి గారు అని.. తర్వాతి రోజు తొక్కిసలాటలో దెబ్బలు తగిలి చనిపోయారని తెలిసింది.
– అది తెలియగానే మేం.. సుకుమార్ గారు.. మేం.. ఎంటైర్ టీం ఆఫ్ పుష్ప అందరం సడన్ గా డిస్పపాయింట్ అయి షాక్ లోకి వెళ్లిపోయాం. ఎందుకంటే.. ఇది అనుకోకుండా జరిగింది. గడిచిన 20 ఏళ్లుగా అన్ని సినిమాలకు మొయిన్ థియేటర్ కు వెళ్లి.. సినిమా చూసి రావటం అన్నది తెలీని ఒక ఆనవాయితీ లాంటిది. ఇన్నేళ్లు ఎప్పుడు జరగలేదు. సడన్ గా జరిగేసరికి.. మేమంతా చాలా డిస్పపాయింట్ అయి షాక్ లోకి వెళ్లాం.
– ఈ న్యూస్ తెలిసినంతనే.. వెరీ ఫస్ట్ డే మేం కాని ఎవరం కాని.. టీం కాని పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా మేం పాల్గొనలేకపోయాం. మేం శాడ్ గా ఫీలయ్యాం. మేం సినిమాలు తీసేదే.. జనాలు థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయాలనే. అలాంటి థియేటర్ లో ఇలా ఒక.. ఇన్సిడెంట్ అయ్యేసరికి ఆల్.. నేను మాటల్లో చెప్పలేకపోతున్నా.
– మొదటగా నేను ఆ కుటుంబానికి నా సంతాప సందేశాన్ని మొత్తం కుటుంబానికి చెప్పానుకుంటున్నా. రేవతిగారి ఫ్యామిలీకి నా సంతాపం. నేను.. ఎంటైర్ పుష్ప టీం చెబుతోంది. మేం ఏం చేసినా ఆ లాస్.. మేం ఏం చేసినా.. ఎంత మాట్లాడినా.. ఆ నష్టం ఎప్పటికి పూడ్చలేనిది. మా సైడ్ నుంచి మేం ఏంచెప్పాలనుకుంటున్నామంటే.. ఎమోషనల్ గా వారితో ఉంటామని చెబుతున్నా.
– మీకేం కావాల్సి వచ్చినా.. మాకున్న శక్తి మేరకు మీరెలా కావాలనుకున్నా ఇచ్చేందుకు మీకు మేమున్నాం. మా తరఫు నుంచి.. నా తరఫు నుంచి రూ.25 లక్షల మొత్తాన్ని డొనేట్ చేస్తున్నా. ఇది కేవలం ఒక గుడ్ విల్ గెస్చర్ (సంజ్ఞ లేదంటే సంకేతం)గా చెబుతున్నా. నేను మీ కోసం ఉన్నాను. నా చేతల్లో చూడండి. నన్ను నమ్మండి. నేను మీ కోసం ఉన్నాను అని. గెస్చర్ గా రూ.25 లక్షలు ఇస్తాను వారి భవిష్యత్తు భద్రత కోసం. ప్రత్యేకించి పిల్లలు ఉన్నారంట. వారి కోసం నేను ఉన్నానని.. వారికి ఎలాంటి సపోర్టు కావాలన్నా.. వారి కోసం నేనున్నా.. ఎంత అవసరమైతే అంత. ఒక గుడ్ విల్ గెస్చర్ గా ఇది చేస్తున్నాం. మెడికల్ ఖర్చు.. ఇతర ఖర్చులంతా కూడా మేం చూసుకుంటాం. మేం అర్థం చేసుకుంటాం. ఆ కుటుంబానికి ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వారికి అవసరమైన సాయమంతా చేయటానికి ఉన్నాం.
– నా తరఫు నుంచి.. పుష్ప టీం మొత్తం నుంచి కుటుంబానికి మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. నాది ఒక్కటే రిక్వెస్టు. మేమంతా సినిమాలు తీసేది.. మీరంతా థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేసేందుకు. మీ ఫ్యామిలీస్ తో వచ్చి.. ఎంజాయ్ చేసి.. ఆ సెలబ్రేషన్ తో మిమ్మల్ని ఇంటికి పంపిద్దామని. ఇలాంటివి సడన్ గా జరిగినప్పుడు.. మేం కూడా కొంచెం.. మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. మా ఉద్దేశమంతా మీ జీవితంలో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇద్దామనే. ప్లీజ్.. నా సిన్సియర్ విన్నపం ఏమంటే.. థియేటర్ కు వెళ్లండి. కొంచెం జాగ్రత్తగా ఉండి. మంచిగా చూడండి. సినిమా చూడండి. ఎంజాయ్ చేయండి. క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లండి. థాంక్యూ.
Deeply heartbroken by the tragic incident at Sandhya Theatre. My heartfelt condolences go out to the grieving family during this unimaginably difficult time. I want to assure them they are not alone in this pain and will meet the family personally. While respecting their need for… pic.twitter.com/g3CSQftucz
— Allu Arjun (@alluarjun) December 6, 2024