నటి మధుబాల గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ హిందీ నటి హేమా మాలినికి మేనకోడలైన మధుబాల.. 90వ దశకంలో హీరోయిన్ గా వెండితెరపై అడుగుపెట్టింది. 1992లో విడుదలైన రోజా మూవీ మధుబాలకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ ఎవర్ గ్రీన్ హిట్ లో అరవింద్ స్వామి హీరోగా నటించారు. తమిళం, తెలుగు, మరాఠీ, హిందీ భాషల్లో రోజా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజికల్ గానూ ప్రేక్షకుల హృదయాలు దోచుకుందీ చిత్రం.
రోజా తర్వాత హీరోయిన్ మధుబాల కొన్నాళ్లు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే గుజరాతీ వ్యాపారి ఆనంద్ షాను మధుబాల పెళ్లాడారు. ఆపై సినిమాలకు బ్రేక్ ఇచ్చి కొన్నాళ్లు అమెరికాలో నివసించిన మధుబాల.. అమేయ, కేయా అనే ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చారు.
2013లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మధుబాల.. సహాయక నటిగా అంతకు ముందు.. ఆ తరువాత.., నాన్నకు ప్రేమతో, సూర్య వర్సెస్ సూర్య ఇలా పలు చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ ఆమె యాక్టింగ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇక మధుబాల కూతుళ్ల విషయానికి వస్తే.. అమేయ, కేయా ఇద్దరూ హీరోయిన్లనే మించిపోయేంత అందంగా ఉంటారు. తాజాగా కూతుళ్ల ఫోటోలను మధుబాల సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో.. నెటిజన్లు వారి గ్లామర్ కు దాసోహం అవుతున్నారు. ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్న అమేయ, కేయ.. తల్లి బాటలోనే సినిమాల్లోకి వస్తారా? లేదా? అన్నది చూడాలి.
View this post on Instagram