అమెరికాలో నమోదైన కేసుల్లో అదానీ బాగానే తప్పించుకున్నట్టు కనిపిస్తోంది. ఆయనకు కేంద్రంలోని పెద్దల నుంచి అభయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన సీనియర్ లాయర్లు.. అదానీ చేసింది తప్పులేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అదానీ తప్పుడు వ్యక్తి కాదని.. ప్రపంచానికి అభివృద్ది మార్గం చూపిస్తున్నారని కూడా తెలిపారు. అసలు అదానీపై కేసులు కూడా నమోదు కాలేదని జఠ్మలానీ వ్యాఖ్యానించారు. ఇక, బీజేపీ సీనియర్లు కూడా ఇలానే ఉన్నారు.
మరోవైపు అదానీ సంస్థలు కూడా.. తమ పొరపాట్లు ఏమీలేవని, అసలు అమెరికా నమోదు చేసిన కేసుల్లో అదానీ పేర్లు కూడా లేవని చెప్పడం గమనార్హం. దీనిని ప్రతిఘంటిచేవారు.. కాదని వాదించే వారు కూడా కరువయ్యారు. అయితే, గియితే.. అమెరికానే స్పందించాలి. కానీ, త్వరలోనే అక్కడ ప్రభుత్వం మారనుంది. ట్రంప్ సారథ్యంలో అమెరికా ఏలుబడి జనవరి నుంచి మొదలవనుంది. దీని కోసమే ప్రధాని మోడీ సహా అదానీ వర్గం ఆశగా ఎదురు చూస్తోంది.
ఎందుకంటే.. మోడీకి ట్రంప్ మిత్రుడు కావడంతో అదానీపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అమెరికాలో భారత సంతతి పౌరులు కూడా చెబుతున్నారు. సో.. అదానీ సేఫ్.. అనేది స్పస్టంగా తెలుస్తోంది. కానీ, ఎటొచ్చీ.. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మాత్రం చిక్కుల్లో పడ్డారు. అదానీ నుంచి ఆయన 1750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారన్నది అమెరికాలో నమోదైన కేసుగా స్థానిక మీడియా చెబుతోంది.
కానీ, దీనికి సంబంధించిన ఆధారాలు లేవు.కానీ, జగన్ మాత్రం అడ్డంగా దొరికిపోయారు. అయితే.. జగన్ను కాపాడేందుకు కేంద్రంలోని పెద్దలు ఇప్పుడు సహకరించే అవకాశం లేదు. అదానీపై ఉన్న ప్రేమ వేరు. జగన్పై ఉన్న ప్రేమ వేరు. పైగా ఇప్పుడు జగన్ అధికారంలో కూడా లేరు. పార్లమెంటులోనూ బలం క్షీణించింది. ఈ ప్రభావం వ్యక్తిగతంగా జగన్పై పడుతోంది. రాష్ట్రంలో ఇంత పెద్ద దుమారం రావడానికి కారణం.. కేంద్రం నుంచి జగన్కు ఎలాంటి సాయం అందదన్న భరోసాతోనే. సో.. ఎలా చూసుకున్నా.. అదానీ సేఫ్ అయినంత ఈజీగా అయితే..జగన్ సేఫ్ కాలేక పోవచ్చని అంటున్నారు పరిశీలకులు.