సోషల్ మీడియా ను అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్న కిరాయి మూకలను శిక్షించాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో జాలి చూపిస్తే.. సమాజానికే ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. ఏపీలో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ.. బూతులు తిడుతూ.. అసభ్యంగా ప్రవర్తించిన వారిని పోలీసులు అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటివాటిని అడ్డుకోవాలని, ఉద్దేశ పూర్వకంగా అరెస్టులు జరుగుతున్నాయని జర్నలిస్ట్ విజయ్ బాబు కొన్నాళ్ల కిందట హైకోర్టు ఆశ్రయించా రు.
ఆయన ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే .. అప్పట్లోనే ఈ పిటిషన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోర్టు.. తాజా తీర్పులో మరింతగా ఫైర్ అయింది. ఖరీదై న ఫోన్లను వినియోగిస్తూ.. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పేర్కొంది. అంతేకాదు.. ఇలాంటి వారి తరఫున ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా వేస్తారని విజయ్బాబును నిలదీసింది. ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసినందుకు జరిమానా విధిస్తున్నామని పేర్కొంది.
ఈ క్రమంలో విజయ్బాబుకు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్నీ నెల రోజుల్లో లీగల్ సర్వీ సెస్ అథారిటీలో చెల్లించాలని, ఈ సొమ్మును దివ్యాంగుల సంరక్షణ కోసం వినియోగించాలని తెలిపింది. అంతేకాదు.. రాజకీయ దురుద్దేశంతో పిల్ వేశారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తమ హక్కులు తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారని ప్రశ్నించింది.
“ప్రజాప్రయోజన వ్యాజ్యాల వుద్దేశం మీకు తెలుసా? వాటిని సమాజంలో అట్టడుగు వర్గాల కోసం. తమ బాధను చెప్పుకోలేని వారి కోసం తీసుకువచ్చిన సౌలభ్యం. కానీ, రాజకీయ దురుద్దేశంతో మీరు కోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా పేరుతో కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు. దీనిని ఎలా సమర్థిస్తారు“ అని కోర్టు ప్రశ్నించింది.