టాలీవుడ్ లవ్ బర్డ్స్ అనగానే విజయ్ దేవరకొండ, రష్మిక నే గుర్తుకు వస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్, రష్మిక జంటగా నటించారు. ఆన్ స్క్రీన్ పై తమ కెమిస్ట్రీ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. సినిమాల ద్వారా ఏర్పడిన పరిచయమే విజయ్, రష్మిక మధ్య ప్రేమగా మారిందని చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. పైగా ఈ జంట తమ ప్రేమ వ్యవహారంపై ఎప్పటికప్పుడు హింట్స్ ఇస్తూనే ఉన్నారు.
ఔటింగ్స్, వెకేషన్స్ కు వెళ్తూ ఇరువురు సేమ్ లొకేషన్ నుంచి వేరువేరుగా ఫోటోలు పోస్ట్ చేసి వార్తల్లో ట్రెండ్ అయ్యారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మీరు సింగిలా, కమిటెడ్డా అని ప్రశ్నించిగా.. 35 ఏళ్లు వచ్చాయి ఇంకా సింగిల్ గా ఉంటానా అంటూ విజయ్ బదులిచ్చాడు. మొన్నటికి మొన్న ఓ రెస్టారెంట్ కు విజయ్, రష్మిక కలిసి లంచ్ డేట్ కు వెళ్లిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఇలాంటి పరిణామాల నడుమ విజయ్ తో లవ్ లో ఉన్నట్టు రష్మిక పరోక్షంగా కన్ఫర్మ్ చేసేసింది.
పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా చెన్నై వేదికగా జరిగిన `కిస్సిక్` సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొంది. అయితే ఈ ఈవెంట్ లో యాంకర్లు రష్మికను పెళ్లి గురించి ప్రశ్నించారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? లేక బయట వ్యక్తినా? అని అడగ్గా.. `దీనికి సమాధానం అందరికీ తెలుసు` అంటూ రష్మిక క్రేజీ కామెంట్స్ చేసింది. ఆమె ఆన్సర్ తో అందరూ అరుపులు పెట్టారు. అల్లు అర్జున్, శ్రీలీల పడీ పడీ నవ్వారు. ఇంతలో యాంకర్ `అందరికీ తెలుసు కానీ నాకు తెలియదు. ఎవరో కొంచెం క్లూ ఇస్తారా?` అని అడగ్గా.. మీకు పర్సనల్ గా చెప్తాలే అంటూ రష్మిక నవ్వేసింది. మొత్తానికి రష్మిక మొదటిసారి విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉన్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించింది.