సెప్టెంబర్ 15 2022 – ఫిబ్రవరి 27 2024 మధ్య కాలంలో $3.04 మిలియన్ డాలర్ల ‘తానా’ ఫౌండేషన్ నిధులని సొంత కంపెనీ అకౌంట్ లోకి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలించిన నాటి కోశాధికారి శ్రీకాంత్.
👉 నిన్నటి బోర్డు సమావేశంలో సమన్లు పంపగా ఈ రోజు నేరాన్ని అంగీకరించి, డిసెంబర్ 15 2024 లోపు ఆ మొత్తాన్ని తిరిగి ‘తానా’ ఖాతా లోకి ఇస్తాను అని ఒప్పుకున్న ఆ కోశాధికారి.
👉 ఇంత పెద్ద మొత్తాన్ని శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక్కడే తన అకౌంట్స్ లోకి తరలించడం అసాధ్యం. ‘తానా’ బోర్డులో వేరే వ్యక్తుల ప్రమేయం తప్పని సరి. వాళ్లు ఎవరో బయటపడాలి అని సభ్యులు కోరుతున్నారు.
👉 ఇన్ని లక్షల డాలర్లు అకౌంట్ లో నుంచి మాయం అయిపోయినా రెండేళ్ల పాటు ట్రాకింగ్ కూడా లేని దారుణమైన వ్యవస్థ ఉన్న ‘తానా’ లాంటిి ఆర్గనైజేషన్ కి దాతలు, సభ్యులు దూరంగా ఉండడం సబబు అనే అభిప్రాయం వినపడుతోంది.
👉 పదవుల కోసం ,అధికారం కోసం తమ సమయాన్ని మొత్తం వృధా చేసే ‘తానా’ నాయకత్వం తీవ్ర అసమర్థులు గా ‘తానా’ సభ్యులు భావిస్తున్నారు.
👉 ‘తానా’ లో ఉన్న అన్ని వర్గాలు ఈ దారుణమైన పరిస్థితులకి కారణం అనే ఆరోపణలు నిజం అయ్యాయి.