సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. కానీ అలా వచ్చి పాలిటిక్స్ లోనూ తమ సత్తా ఏంటో నిరూపించుకున్నవారు కొందరే ఉన్నారు. వారిలో ఆర్కే రోజా ఒకరు. ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వివాహం అనంతరం సినిమాలకు స్వస్థి పలికిన రోజా.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. కానీ మొన్నటి ఎన్నికల్లో రోజా ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. గత ఐదేళ్లు వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా వ్యవహరించిన రోజా.. ఓటమి తర్వాత బాగా సైలెంట్ అయ్యారు. ఇక తాజాగా రోజా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజకీయ పరమైన అంశాలే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా పంచుకున్నారు.
ఈ క్రమంలోనే తన కొడుకు, కూతురు ఫిల్మ్ ఎంట్రీపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `మా అబ్బాయి కౌశిక్ చదువుకుంటున్నాడు.. తనకి హీరో కావాలని ఉంది.. డైరెక్షన్ పై కూడా ఆసక్తి ఉంది. అలాగే అమ్మాయి అన్షు మాలిక అచ్చం నాలాగే ఉంటుంది. తనకి చదువు అంటేనే ఇష్టం. సైంటిస్ట్ అవ్వాలని ఆశపడుతుంది. ఒకవేళ స్టడీస్ తర్వాత సినిమాల్లోకి వస్తానన్న మాకు సంతోషమే` అని రోజా చెప్పుకొచ్చారు. ఇక బయట తాను గట్టిగా మాట్లాడతాను కానీ.. ఇంట్లో మాత్రం పెత్తనమంతా తన భర్తదే అని రోజా తెలిపారు.